LIVE : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024 - ప్రత్యక్షప్రసారం - తెలంగాణ బడ్జెట్ సెషన్స్ 2024 లైవ్
Published : Feb 8, 2024, 11:31 AM IST
|Updated : Feb 8, 2024, 11:59 AM IST
Telangana Budget Sessions 2024 Live : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే తరహాలో తెలంగాణలోనూ ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీటి పారుదల అంశాలతో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. నీటి పారుదల రంగానికి సంబంధించి ఈ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెడతామని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆడిటింగ్ నిర్వహించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. వాటిని సర్కార్ ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. మరో రెండు గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారు. బీసీ కులగణన కోసం ప్రత్యేక బిల్లును కూడా ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు వీటితోపాటు మరికొన్ని ఇతర బిల్లులు, అంశాలు కూడా శాసనసభ, మండలి ముందుకు రానున్నాయి.