సక్సెస్‌ఫుల్‌గా 'థ్యాంక్యూ ఇండియా' ప్రెస్ మీట్ - వాళ్లకు బన్నీ ప్రత్యేక ధన్యవాదాలు - ALLU ARJUN PUSHPA 2
Published : Dec 13, 2024, 9:23 AM IST
|Updated : Dec 13, 2024, 9:54 AM IST
Pushpa 2 Delhi Pressmeet : 'పుష్ప 2' చిత్రం సాధిస్తున్న వసూళ్లు తాత్కలికమేనని, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికి తన హృదయంలో అలాగే నిలిచిపోతుందనంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమా వెయ్యి కోట్లు వసూళ్లు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన బన్నీ, ఈ క్రమంలో నిర్మాతలతో కలిసి దిల్లీ వెళ్లారు. అక్కడ థ్యాంక్యూ ఇండియా అనే పేరిట నిర్వహించిన విజయోత్సవాల్లో అల్లు అర్జున్ సందడి చేశారు.
ఇక సినిమా గురించి పలు ఆసస్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన బన్నీ, కాసేపు విలేకరులతో అలాగే అక్కడి అభిమానులతో ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసు శాఖకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే వేసవి లోపు 'పుష్ప 2' రికార్డులు బద్దలు కావాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ ఆకాంక్షించారు. అప్పుడే ఏ చిత్ర పరిశ్రమైనా పురోగతి సాధించినట్లు అవుతుందన్నారు. ఇక తన మూవీ డైరెక్టర్ సుకుమార్‌ను కూడా ఈ ఈవెంట్లో కొనియాడారు.