తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎయిమ్స్ మూడో అంతస్తులోకి పోలీస్ వ్యాన్- నర్సింగ్ ఆఫీసర్ అరెస్ట్- రిటర్న్​లో ర్యాంప్ ద్వారా! - Police Van Enters Hospital - POLICE VAN ENTERS HOSPITAL

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 2:30 PM IST

Updated : May 23, 2024, 2:45 PM IST

Police Jeep Enters Into AIIMS Viral Video : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసు వాహనం ఏకంగా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు దూసుకొచ్చింది. ఉత్తరాఖండ్ రిషికేశ్‌ ఎయిమ్స్​లో ఈ ఘటన జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ దృశ్యాలు యాక్షన్‌ సన్నివేశాన్ని తలపించాయి. 

ఇంతకీ ఏం జరిగిందంటే?
విధుల్లో ఉన్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించారంటూ మూడురోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్ ఆరోపించారు. అతడు తనకు వాట్సాప్​లో అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇతర వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని విధుల నుంచి తొలగించాలంటూ వారు ఆస్పత్రి వెలుపల నిరసన చేపట్టారు.

అదే సమయంలో నర్సింగ్ ఆఫీసర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు  వచ్చారు. బయట ఆందోళన చేస్తున్న సిబ్బందిని చూసి తమ వాహనంతో నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లిపోయారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి ర్యాంప్ ద్వారా వాహనంతో పోలీసులు ఆస్పత్రి బయటకొచ్చారు.

అయితే పోలీసు వాహనం లోపలికి వెళ్తున్న వీడియోలో బెడ్లపై పేషెంట్లు కనిపించారు. ఎస్‌యూవీ వస్తుండగా కొందరు భద్రతా సిబ్బంది అది వెళ్లడానికి దారిని సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం అతడిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ శిక్ష సరిపోదని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి.

Last Updated : May 23, 2024, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details