A Man Attempted For Theft in Chatanpally : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని చటాన్‌పల్లిలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న పద్మ అనే మహిళా ఇంట్లో దొంగతనం చేయడానికి ఓ రాత్రంతా ముప్పుతిప్పలు పడ్డాడు. దత్తాత్రేయ గుడి సమీపంలో సోమవారం జనవరి 27న తెల్లవారు జామున 5 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి పద్మ ఇంట్లోకి చొరబడడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎంతకీ తలుపులు తెరచుకోకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే : ఆదివారం (జనవరి 26న) అంగన్వాడీ టీచర్ పద్మ తన భర్త విక్రమ్‌కు అనారోగ్యం కారణంగా చికిత్స చేయించడానికి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. వారు వెళ్లి రావడానికి రెండు రోజుల సమయం పట్టింది. సోమవారం (జనవరి 27న) తెల్లవారు జామున తమ ఇంటికి వచ్చి చూసే సరికి తలుపు తాళం సగం విరిగి ఉండడం వారికి కనిపించింది.
సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు : సీసీ కెమెరాలను తనిఖీ చేయగా దొంగ తమ ఇంట్లోకి ప్రహరి గోడ దూకి అక్రమంగా ప్రవేశించి తలుపుకున్న తాళాన్ని విరగొట్టడానికి నానా తంటాలు పడిన దృశ్యాలు వెలుగు చూశాయి. తాళం తీయలేకపోవడంతో చోరీ జరగలేదు. పాపం ఆ దొంగ తాళం తీసేందుకు నానా తంటాలు పడ్డాడు. సీసీ ఫుటేజ్ చూసిన తరువాత ఇంటి యజమాని విక్రమ్ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఈ ప్రాంతంలో చోరీ చేయడానికి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.
ఈ దొంగ రూటే సెపరేటు - యూట్యూబ్‌లో చూసి చైన్ స్నాచింగ్
తెలియని వారిని ఇంట్లో పనికి పెట్టుకుంటున్నారా? - అయితే వారిపై ఓ కన్నేయండి