LIVE : మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో - KCR Road Show LIVE - KCR ROAD SHOW LIVE
Published : May 1, 2024, 7:23 PM IST
|Updated : May 1, 2024, 7:35 PM IST
BRS Chief KCR Lok Sabha Election Campaign in Mahabubabad Live : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మానుకోటకు గులాబీ దళపతి కేసీఆర్ విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. మహబూబాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా రోడ్ షో నిర్వహించి, ప్రసంగిస్తున్నారు. ఈ రోడ్‌షోకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా అధికార కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. గులాబీ పార్టీ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నియోజకవర్గాల్లో హస్తం, కమలం పరిస్థితి, ప్రజల ఆలోచనా విధానం, సమస్యల ఆధారంగా ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నేతలకు కేసీఆర్ సూచిస్తున్నారు. కేసీఆర్ పర్యటన ద్వారా రాష్ట్రంలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం భావిస్తోంది.
Last Updated : May 1, 2024, 7:35 PM IST