తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఖమ్మంలో నటుడు వెంకటేశ్‌ ఎన్నికల ప్రచారం - Venkatesh Daughter Ashritha LIVE - VENKATESH DAUGHTER ASHRITHA LIVE

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 6:25 PM IST

Updated : May 7, 2024, 7:29 PM IST

Hero Venkatesh Election Campaign in Khammam Live : ఖమ్మంలో నటుడు వెంకటేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. అపార్టుమెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు. మహిళలతో సరదాగా ఫొటోలు దిగుతూ కాంగ్రెస్​ను గెలిపించాలని కోరుతున్నారు. రఘురాం రెడ్డితో కలిసి ప్రచారానికి వెళ్తూ, ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.టాలీవుడ్​ సీనియర్​ హీరో విక్టరీ వెంకటేశ్​ పెద్ద కుమార్తె ఆశ్రితను ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్​ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో వెంకటేశ్​కు రఘురాంరెడ్డి వియ్యంకుడు అయ్యాడు. అలాగే ఆయన చిన్న కుమారుడు అర్జున్​ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిను వివాహం చేసుకున్నారు. ఆశ్రిత సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ యూట్యూబ్​ ఛానల్​లో ఇన్​ఫినిటీ ప్లాటర్ అనే కుకింగ్​​ ఛానల్​ను ప్రారంభించారు. ఆమె స్వయంగా ప్రొఫెషనల్​ బేకర్​. అలాగే ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఎవరైనా ఏదైనా సమాచారం అడిగితే యాక్టివ్​గా ఉంటూ వాటికి సమాధానాలు చెబుతూ ఉంటారు.
Last Updated : May 7, 2024, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details