తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : యాదాద్రి ఆలయ స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో రేవంత్ రెడ్డి దంపతులు - GOLDEN GOPURAM UNVEIL LIVE

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 11:35 AM IST

Updated : Feb 23, 2025, 12:44 PM IST

Divya Vimana Golden Gopuram Unveil Live : యాదగిరిగుట్ట ఆలయంలో దివ్యవిమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం జరుగుతోంది. స్వర్ణమయంగా మారిన దివ్యవిమాన గోపురం, బంగారు గోపురాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించారు. ఉదయం 11.54 గంటలకు స్వర్ణగోపురాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించగా, ఈ మహా క్రతువులో ఎంపీ చామల కిరణ్​కుమార్​, ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భక్తులకు దర్శనమిచ్చిన స్వర్ణగోపురం. భక్తులు, దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68 కిలోల బంగారంతో గోపురాన్ని స్వర్ణమయంగా మార్చారు. స్వర్ణతాపడం కోసం రూ.80 కోట్లకు పైగా ఆలయ అధికారులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మహాక్రతువును తిలకించేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. సీఎం రావడంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. స్వర్ణ గోపురం ఆవిష్కరణలో భాగంగా ఈనెల 19 నుంచి మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో ప్రసిద్ధి చెందిన గంగా, యమునా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ చేశారు.
Last Updated : Feb 23, 2025, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details