రైల్వే స్టేషన్ బయట కిలోమీటర్ వరకు ఎటుచూసినా జనం- దీపావళి ఎఫెక్ట్ - SURAT RAILWAY STATION CROWD
Published : Oct 30, 2024, 7:52 PM IST
Surat Railway Station Crowd : రైల్వే స్టేషన్ బయట ఒక కిలోమీటర్ మేర ప్రయాణికులు బారులు తీరిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. సూరత్‌లో నివసిస్తున్న యూపీ-బిహార్‌కు చెందిన దాదాపు 10 లక్షల మంది ప్రజలు దీపావళి, ఛత్‌పూజ సందర్భంగా స్వగ్రామాలకు బయలుదేరారు. వీరి కోసం పశ్చిమ రైల్వే అదనంగా 51 రైళ్లను కూడా నడుపుతోంది. కానీ ఇవేవీ సమయానికి రాకపోవడం వల్ల ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు, సెంట్రల్ పోలీసులు కూడా ఈ జనాలను అదుపు చేయలేకపోయారు. దీనితో సమస్య మరింత తీవ్రం అయ్యింది. కొందరు ప్రయాణికులు రెండు రోజులపాటు రైల్వే స్టేషన్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పై తరగతి టికెట్ ఉన్నవాళ్లు కూడా జనరల్ బోగీల్లో ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. దీనితో పిల్లలు, వృద్ధులు, మహిళలు చాలా ఇబ్బందిపడ్డారు. దీనికంతటికీ రైల్వే వ్యవస్థ వైఫల్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.