Yearender 2024:గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్లో SUVల ప్రజాదరణ వేగంగా పెరిగుతోంది. ఎక్కువమంది వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కార్ల తయారీ కంపెనీలు ఈ ఏడాది అనేక SUVలను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ సందర్భంగా 2024లో దేశీయ మార్కెట్లో విడుదలైన టాప్-10 SUVల గురించి తెలుసుకుందాం రండి.
1. Tata Curvv:
Tata Curvv (Photo Credit- Tata Motors) దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన 'టాటా కర్వ్'ను ఆగస్టు 7, 2024న భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీన్ని రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ధరలో తీసుకొచ్చింది. టాటా కర్వ్ బేస్ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించారు.
2. Toyota Urban Cruiser Taisor:
Toyota Taisor (Photo Credit- Toyota Kirloskar) జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా తన 'అర్బన్ క్రూయిజర్ టైజర్'ను ఏప్రిల్ 3, 2024న భారతదేశంలో ప్రారంభించింది. ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్. ఇది దీని బేస్ వేరియంట్ కంటే కొంచెం ఎక్కువ ధరతో వస్తుంది. అయితే దీని డిజైన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది పెట్రోల్-CNG వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ టైసర్‌లో అదిరే ఫీచర్లను అందించింది. దీంతో ఈ SUV సిటీ డ్రైవింగ్, హైవేలపై కంఫర్డబుల్ ప్రయాణానికి బాగుంటుంది.
3. Mahindra Thar 5-Door:
Mahindra Thar Roxx (Photo Credit- Mahindra & Mahindra)) థార్ 5-డోర్ వెర్షన్ మహింద్రా థార్‌ను కంపెనీ 'మహింద్రా థార్ రాక్స్' పేరుతో ఆగస్టు 15, 2024న భారతదేశంలో రిలీజ్ చేసింది. ఈ SUV ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ కలిగి ఉంది. ఇక ఇందులో రెండు 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
4. Mahindra 3XO:
Mahindra 3XO (Photo Credit- Mahindra & Mahindra) స్వదేశీ SUV తయారీ సంస్థ మహింద్రా ఏప్రిల్ 29, 2024న XUV 3XOని విడుదల చేసింది. ఇది ప్రాథమికంగా మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ వెర్షన్. దీని ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ మహింద్రా 3XOలో చాలా అప్డేట్లు చేసింది. ఇందులో రీడిజైన్, సరికొత్త క్యాబిన్, అడిషనల్ ఫీచర్లతో పాటు అప్‌డేట్ చేసిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.
5. Force Gurkha 5-Door:
Force Gurkha 5-Door (Photo Credit- Force Motor) 2024 ఫోర్స్ గూర్ఖా 5-డోర్ SUVని ఇండియన్ మార్కెట్లో మా మే2, 2024న లాంఛ్ చేశారు. దీని ధర 3-డోర్ మోడల్ ధర రూ. 16.75 లక్షలు (ఎక్స్-షోరూమ్), 5-డోర్ మోడల్ ధర రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో ఏడుగురు సౌకర్యంగా కూర్చోవచ్చు.
6. Mercedes-Benz GLA Facelift:
Mercedes-Benz GLA (Photo Credit- Mercedes-Benz India) లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన అప్డేటెడ్ GLA SUVని భారత్‌లో ఈ ఏడాది విడుదల చేసింది. కంపెనీ ఈ కారులో కొన్ని కాస్మెటిక్ మార్పులను చేయడంతో పాటు చాలానే టెక్నికల్ ఫీచర్లను అందించింది. మెర్సిడెస్ ప్రస్తుతం ఈ కారును రూ. 50.50 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఇందులో GLA 200, GLA 220d 4Matic, GLA 220d 4Matic AMG లైన్ అనే మూడు ట్రిమ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక ఈ SUV పెట్రోల్, డీజిల్ ఇంజన్ రెండు ఆప్షన్లనూ కలిగి ఉంది. దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 58.15 లక్షలు (ఎక్స్-షోరూమ్).
7. Audi Q8 Facelift:
Audi Q8 (Photo Credit- Audi India) ఆడి ఇండియా తన 'క్యూ8 ఫేస్‌లిఫ్ట్'ను ఆగస్టు 22న విడుదల చేసింది. దీని ధర రూ. 1.17 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ అప్డేటెడ్ SUV మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మునుపటిలాగే ఉంది. అయితే దీనిలో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసి అదనంగా కొన్ని ఫీచర్లను అందించారు. కొత్త ఎయిర్ ఇన్‌టెక్, ఆక్టాగోనల్ ఇన్సర్ట్ కోసం దీనిలో ఫ్రంట్ గ్రిల్, సరికొత్త డిజైన్‌తో బంపర్‌ను అమర్చారు. వీటితో పాటు ఈ కారు వెనక LED టెయిల్ ల్యాంప్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. అంతేకాక లేజర్ అసిస్టెన్స్ HD మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్‌లు ఈ '2024 Audi Q8'లో ఉన్నాయి.
8. Range Rover Evoque Facelift:
Range Rover Evoque (Photo Credit- Land Rover) '2024 రేంజ్ రోవర్ ఎవోక్ ఫేస్‌లిఫ్ట్' భారతదేశంలో 30 జనవరి 2024న లాంఛ్ అయింది. కంపెనీ ఈ కారును రూ. 67.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ కారులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ 5-సీటర్ లగ్జరీ SUV.. 5 ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది.
9. Nissan X-Trail (4th Generation):
Nissan X-Trail (Photo Credit- Nissan India) ఫోర్త్ జనరేషన్ నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఆగస్టు 1, 2024న ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది. కంపెనీ ఈ కారును రూ. 49.92 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. దీని ప్రధాన ఏరోడైనమిక్ ఫీచర్లలో దిగువ ఫ్రంట్ ఫాసియాలో '3D' టైర్ డిఫ్లెక్టర్, ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో ఎయిర్ వెంటిలేషన్‌ను కంట్రోల్ చేసేందుకు యాక్టివ్ గ్రిల్ షట్టర్, స్పెషల్ A-పిల్లర్ షేపింగ్, వెహికల్ కింద గాలి వెంటిలేషన్ కోసం అండర్ బాడీ కవర్, యునిక్ 'ఎయిర్ కర్టెన్' ఉంది.
10. MINI Countryman E (3rd Generation):
MINI Countryman Electric (Photo Credit- MINI India) MINI కంట్రీమ్యాన్ E, కూపర్ S ఇండియన్ మార్కెట్లో 24 జూలై 2024న లాంఛ్ అయ్యాయి. కంపెనీ ఈ కారు పరిమాణాన్ని మునుపటి కంటే పెంచింది. దీని కారణంగా దాని క్యాబిన్ స్పేస్ కూడా పెరిగింది. ఇందులో వెనకవైపు 130mm అడిషనల్ లెగ్‌రూమ్ అందుబాటులో ఉంది. కారు వెనక సీటు బ్యాక్‌రెస్ట్‌ను ఆరు పొజిషన్లలో 12 డిగ్రీల వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. దీనికి 460 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. కంపెనీ ఈ 5-సీట్ల MINI కంట్రీమాన్ ఎలక్ట్రిక్‌ను రూ. 54.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విక్రయిస్తోంది.
టెంపరేచర్‌ను బట్టి కలర్స్ మార్చే స్మార్ట్‌ఫోన్- దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడో తెలుసా?
వారెవ్వా.. రోల్స్ రాయిస్ కొత్త కారు ఏం ఉంది భయ్యా!- ఒక్క చూపుకే ఫిదా అయిపోవడం ఖాయం!
2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? అవి ఏ రాశులపై ప్రభావం చూపిస్తాయి?
అబ్బబ్బా ఏమి డిమాండ్ రా సామీ!- 11 నెలల్లో లక్షమంది కొన్న కారు ఇదే!
అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు.. కియా కొత్త కారు అదుర్స్!- జనవరి 3 నుంచి బుకింగ్స్