ETV Bharat / technology

తరగని అందం, అద్భుతమైన ఫీచర్లతో.. హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్‌- లాంఛ్ ఎప్పుడంటే? - HONDA ELEVATE BLACK EDITION

త్వరలో మార్కెట్లోకి హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్‌- రిలీజ్​కు ముందే డీటెయిల్స్ లీక్!

Honda Elevate
Honda Elevate (Photo Credit- Honda Cars India)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 3, 2025, 7:43 PM IST

Honda Elevate Black Edition: హోండా కార్స్ ఇండియా త్వరలో తన మిడ్-సైజ్ SUV హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్‌ను విడుదల చేయబోతోంది. రీసెంట్​గా ఈ వెర్షన్ ప్రొడక్షన్-రెడీ ఇమేజ్​లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఇది త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

హోండా కార్స్ ఈ SUVని రెండు వెర్షన్లలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాటిలో మొదటిది ఎలివేట్ బ్లాక్ ఎడిషన్. ఇక రెండోది ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్. ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ స్పెషల్ ఎడిషన్ జనవరి 7న విడుదల కానుంది.

హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ డిజైన్: హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్​.. క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ ఎక్స్‌టీరియర్ పెయింట్, గ్లోస్ బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్స్, ఎగువ గ్రిల్‌పై క్రోమ్ ఫినిషింగ్, రూఫ్ రైల్స్‌పై సిల్వర్ ఫినిషింగ్, డోర్‌ల దిగువ భాగంలో సిల్వర్ ఫినిషింగ్​తో వస్తుంది. దీని ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ లెథెరెట్ సీట్లు ఇవ్వనున్నారు.

హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్.. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్​, అల్లాయ్ వీల్స్ ఒకే విధమైన సెటప్‌ను కలిగి ఉంటాయి. ఇది బ్లాక్-పెయింటెడ్ అప్పర్ గ్రిల్, రూఫ్ రైల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్లతో పాటు డోర్స్ దిగువ భాగంలో బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ ప్రత్యేక వేరియంట్​లో ఫ్రంట్ ఫెండర్​తో 7-రంగుల ఇంటీరియర్ యాంబియంట్ లైటింగ్‌పై అదనంగా లోగో కూడా ఉంటుంది.

ఎలివేట్ బ్లాక్, ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్‌లు టాప్ వేరియంట్‌లపై ఆధారపడి ఉంటాయి. అంటే అవి ఎక్కువ ఫీచర్లతో లోడ్ అయి రానున్నాయి. వీటిలో సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఆటో హెడ్‌లైట్స్, వైపర్స్, 7.0-అంగుళాల TFT డిస్‌ప్లేతో సెమీ-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కెమెరా-బేస్డ్ ADAS సూట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ పవర్‌ట్రెయిన్: ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ పవర్‌ట్రైన్ విషయానికి వస్తే.. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. ఇప్పటికే ఉన్న 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్​నే ఇందులో కూడా అందించన్నారు. ఇది 120 bhp పవర్​ను అందిస్తుంది. దీనితో మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ వస్తుంది.

యాపిల్ లవర్స్​కు గుడ్​న్యూస్- ఐఫోన్ 16 సిరీస్​పై ఆఫర్ల వర్షం!- ఎక్కడంటే?

పవర్​ఫుల్ ప్రాసెసర్, కిర్రాక్ ఫీచర్లతో 'రెడ్​మీ టర్బో 4'- దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లతో కియా సిరోస్- బుకింగ్స్ స్టార్ట్- కేవలం రూ.25,000 చెల్లిస్తే చాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.