2025 Ather 450: ఈ కొత్త సంవత్సరంలో మంచి ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మార్కెట్లోకి ఏథర్ నుంచి 2025 మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ తన '450 సిరీస్'ను అప్డేట్ చేసి అద్భుతమైన ఫీచర్లతో స్కూటర్లను తీసుకొచ్చింది. ఈ స్కూటర్లతో పాటు ఏథర్ హాలో హెల్మెట్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. మార్కెట్లో వీటి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరెందుకు ఆలస్యం వీటి ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
450 సిరీస్‌లో ఏథర్ కొత్త మోడల్స్ ఇవే:
- 2025 ఏథర్ 450S
- 2025 ఏథర్ 450X
వీటితో పాటు కంపెనీ పరిమిత కాలం ఎడిషన్ కింద '450 అపెక్స్' స్కూటీని కూడా తీసుకొచ్చింది.
2025 ఏథర్ 450S: ఈ ఏథర్ కొత్త మోడల్ స్కూటర్లో MRF మల్టీ కాంపౌండ్ టైర్లను వినియోగించారు. దీంతో మెరుగైన గ్రిప్ సాధ్యమవుతుంది. ఏథర్ స్టాక్ 6 సాఫ్ట్‌వేర్‌తో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. దీని సహాయంతో గూగుల్ మ్యాప్స్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, వాట్సాప్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు. వీటితో పాటు ఈ స్కూటర్లో కొత్తగా 'పింగ్ మై స్కూటర్', లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లనూ అందించారు.
- బ్యాటరీ కెపాసిటీ: 2.9kWh
- ఐడీసీ రేంజ్: 122 కి.మీ
- ధర: రూ.1,29,999 (ఎక్స్‌షోరూమ్)
దీని 2.9kWh బ్యాటరీని ఏథర్ డ్యుయె ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 3 గంటల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.
2025 ఏథర్ 450X: ఈ ఎలక్ట్రిక్ స్కూటీ రెండు వేరియంట్లలో, ఆరు ఆకట్టుకునే కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని మొదటి వేరియంట్ 2.9 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. దీని ఐడీసీ రేంజ్ 126 కిలోమీటర్లు. దీని ధరను కంపెనీ రూ.1,46,999గా నిర్ణయించింది.
ఇక 2025 ఏథర్ 450X మోడల్లో రెండో వేరియంట్ 3.7kWh బ్యాటరీతో వస్తుంది. దీని ఐడీసీ రేంజ్ 161 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో దీని ధర రూ.1,56,999.
మరోవైపు పరిమిత కాలపు ఎడిషన్ కింద తీసుకొచ్చిన '450 అపెక్స్' ధరను రూ.1,99,999గా ఏథర్ నిర్ణయించింది. దీని ఐడీసీ రేంజ్ 157 కిలోమీటర్లు అని కంపెనీ చెబుతోంది.
ఏంటీ ఐడీసీ రేంజ్?: ఐడీసీ (Indian Driving Conditions) రేంజ్ అనేది వాస్తవ రేంజ్ కంటే కాస్త తక్కువగా ఉంటుంది.
ఏథర్ తీసుకొచ్చిన ఈ నయా మోడల్ స్కూటర్లలో MRF మల్టీ కాంపౌండ్ టైర్లను వినియోగించారు. వీటిలోని 450X, 450 అపెక్స్ మోడల్స్ రెండూ ట్రాక్షన్ కంట్రోల్‌తో వస్తున్నాయి. వీటిలో రెయిన్, రోడ్, ర్యాలీ మోడ్స్ అందించారు. ఈ నయా మోడల్ స్కూటర్లను ఏథర్ స్టాక్ 6 సాఫ్ట్‌వేర్‌తో తీసుకొచ్చారు. దీని సాయంతో గూగుల్ మ్యాప్స్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, వాట్సాప్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు. కొత్తగా 'పింగ్ మై స్కూటర్', లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లనూ వీటిలో అందించారు.
తరగని అందం, అద్భుతమైన ఫీచర్లతో.. హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్- లాంఛ్ ఎప్పుడంటే?
పవర్ఫుల్ ప్రాసెసర్, కిర్రాక్ ఫీచర్లతో 'రెడ్మీ టర్బో 4'- దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?
యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్- ఐఫోన్ 16 సిరీస్‌పై ఆఫర్ల వర్షం!- ఎక్కడంటే?