Whatsapp UPI Payments Feature :ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన యూజర్లు కోసం పేమెంట్స్ ఫీచర్‌ను మరింత సులభతరం చేసింది. చాట్ లిస్ట్‌లోనే క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించే విధంగా మార్పులు తీసుకువచ్చింది. వాస్తవానికి వాట్సాప్ దేశంలో తన యూపీఐ పేమెంట్స్ సేవలను ప్రారంభించి చాలా రోజులే అయ్యింది. కానీ దీనికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు.
యూజర్లు చాట్ చేసేందుకు, స్టేటస్లు చూసేందుకు, ఆడియో/ వీడియో కాల్స్ చేసుకునేందుకు మాత్రమే వాట్సప్‌ను విరివిగా వాడుతున్నారు. కానీ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను మాత్రం వాడడంలేదు. దీనిని గుర్తించిన వాట్సాప్, తమ యూజర్లను చేరుకునేందుకు సరికొత్త ప్లాన్‌తో ముందుగు వచ్చింది. యూపీఐ పేమెంట్స్ ఫీచర్‌ను చాలా సులభతరం చేసింది.
చాల్ లిస్ట్‌లోనే క్యూఆర్ కోడ్!
ప్రస్తుతం వాట్సప్ పేమెంట్స్ చేయాలంటే త్రీ డాట్స్‌లోకి వెళ్లి, పేమెంట్స్ మెనూ ఓపెన్ చేసి చెల్లింపులు చేయాల్సి వస్తోంది. దీనితో దీనిని యూజర్లు వాడడానికి ఇష్టపడడం లేదు. అందుకే వాట్సాప్ ఇకపై చాట్ లిస్ట్‌లోనే క్యూఆర్ కోడ్‌ను పొందుపరుస్తోంది. దీనితో సింపుల్‌గా పేమెంట్స్ చేయడానికి వీలవుతుంది. వాట్సప్ బ్యానర్, కెమెరా సింబల్ మధ్యలో కొత్తగా క్యూఆర్ కోడ్ స్కానర్‌ను ఇస్తున్నారు. దీనిని ఉపయోగించి, వాట్సాప్ యూపీఐకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ద్వారా నేరుగా పేమెంట్స్ చేయవచ్చు. దీనివల్ల యూజర్ల మంచి పేమెంట్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. పైగా సమయం కూడా ఆదా అవుతుంది.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే ఈ వాట్సాప్ పేమెంట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మిగతావారికి దశలవారీగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు.