తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ కంప్యూటర్‌ స్లోగా రన్ అవుతోందా? డోంట్ వర్రీ - ఈ 10 టిప్స్‌తో PC స్పీడ్ పెరగడం గ్యారెంటీ! - TIPS TO IMPROVE PC PERFORMANCE

మీ విండోస్‌ 11 పీసీ లాగ్ అవుతోందా? ఈ 10 టిప్స్‌ యూజ్ చేస్తే చాలు - PC స్పీడ్‌ పెరగడం పక్కా!

Tips to improve PC performance
Tips to improve PC performance (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 1:59 PM IST

Tips To Improve PC Performance :మీ పర్సనల్ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ స్లోగా రన్ అవుతోందా? డోండ్ వర్రీ. ఈ ఆర్టికల్‌లో చెప్పిన టిప్స్ పాటిస్తే, మీ పీసీ స్పీడ్ పెరుగుతుంది.

  1. కంప్యూటర్ స్పీడ్‌గా వర్క్ చేయాలంటే, ఎప్పటికప్పుడు విండోస్‌ను, డివైజ్ డ్రైవర్స్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
  2. మీ పీసీని రీస్టార్ట్ చేసి, మీరు ఉపయోగించాలని అనుకుంటున్న యాప్‌లను మాత్రమే ఓపెన్ చేయాలి. అప్పుడే కంప్యూటర్ స్పీడ్‌గా పనిచేస్తుంది. అనవసరమైన యాప్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంటే, అవి కూడా ర్యామ్‌ను వాడుకుంటాయి కనుక పీసీ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది.
  3. మీ కంప్యూటర్ స్పీడ్‌గా రన్ కావాలంటే, ReadyBoost ను వాడవచ్చు. ఈ రెడీ బూస్ట్ మీ కంప్యూటర్‌కు యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్‌ లాంటి రిమూవబుల్‌ డ్రైవ్‌లను ఎటాచ్‌ చేసి, ర్యామ్‌ (RAM)ను పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఈ రెడీబూస్ట్‌ను మీరు ఉపయోగించాలంటే, హై డేటా ట్రాన్స్‌ఫర్‌ రేట్ కలిగిన, 500 ఎంబీ లేదా అంత కంటే ఎక్కువ ఫ్రీ స్పేస్‌ కలిగిన మెమొరీ కార్డ్ లేదా యూఎస్‌బీ ఫ్లాష్‌ డ్రైవ్ వాడాలి.
  4. మీ కంప్యూటర్ హార్డ్‌ డిస్క్‌లో పేజింగ్ ఫైల్ అనే ఏరియా ఉంటుంది. దీనిని విండోస్‌ ఒక మెమొరీలాగా యూజ్ చేస్తుంటుంది. విండోస్‌ 11లో పేజ్‌ ఫైల్‌ పరిమాణాన్ని ఆటోమేటిక్‌గా మేనేజ్ చేసే సెట్టింగ్ ఉంటుంది. అయితే దీనిని మీరు ఆన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అది మీ కంప్యూటర్‌ స్పీడ్‌గా పనిచేసేలా చేస్తుంది.
  5. డిస్క్‌ స్పేస్‌ పూర్తిగా నిండిపోయినప్పుడు కూడా కంప్యూటర్‌ స్లో అయిపోతుంది. అందువల్ల మీ డిస్క్‌లోని అనవసరమైన ఫైల్స్‌ను డిలీట్ చేయాలి. లేదా మరో మెమొరీ డివైజ్‌లోకి వాటిని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అప్పుడే డిస్క్ స్పేస్ ఖాళీ అయ్యి, కంప్యూటర్‌ వేగంగా రన్‌ అవుతుంది.
  6. విండోస్ 11 కంప్యూటర్‌లో యానిమేషన్స్‌, షాడో ఎఫెక్ట్స్‌ లాంటి అనేక విజువల్ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. ఇవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఇవి మీ సిస్టమ్ రిసోర్స్‌ను ఎక్కువగా వాడుకుంటాయి. కనుక మీ పీసీ పని సామర్థం బాగా తగ్గుతుంది. ముఖ్యంగా ర్యామ్‌ తక్కువగా ఉన్న పీసీల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కనుక అనవసరపు విజువల్ ఎఫెక్ట్స్‌ను టర్న్ ఆఫ్ చేసుకోవడమే మంచిది.
  7. కంప్యూటర్‌లో మనం ఫైల్స్ సేవ్ చేస్తుంటాం. అయితే డిఫాల్ట్‌గా ఈ ఫైల్స్ మీ కంప్యూటర్‌తో పాటు వన్‌డ్రైవ్‌లో కూడా సేవ్ అవుతుంటాయి. ఒకవేళ మీ కంప్యూటర్ పోయినా, లేక డ్యామేజ్ అయినా ఈ వన్‌డ్రైవ్‌ ద్వారా మీ ఫైల్స్‌ను తిరిగి పొందడానికి వీలు అవుతుంది. కానీ ఈ వన్‌డ్రైవ్‌ సింకింగ్ వల్ల కూడా మీ కంప్యూటర్ స్లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కనుక మీకు అవసరం లేనప్పుడు వన్‌డ్రైవ్ సింకింగ్‌ను పాజ్‌ చేయడమే మంచిది.
  8. మీ కంప్యూటర్ ఆన్ చేయగానే కొన్ని స్టార్టప్ ప్రోగ్రామ్ ఓపెన్ అయిపోయి, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. దీని వల్ల కూడా మీ కంప్యూటర్ స్లో అయిపోతుంది. అందువల్ల ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే ప్రోగ్రామ్‌లను డిజేబుల్ చేయాలి.
  9. కంప్యూటర్‌లో ప్రమాదకరమైన వైరస్‌లు, మాల్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌ అయ్యున్నప్పుడు, అలాగే మలీసియెస్‌ సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసినప్పుడు, సిస్టమ్ కచ్చితంగా స్లో అయిపోతుంది. కనుక వీటిని తొలగించడానికి యాంటీవైరస్‌, యాంటీ మాల్‌వేర్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించాలి. లేదా విండోస్ కంప్యూటర్‌లో 'విండోస్‌ సెక్యూరిటీ' అనే సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దీనిని ఉపయోగించి వైరస్‌లను, మాల్‌వేర్‌ను తొలగించాలి.
  10. విండోస్‌లో మీరు ఇటీవల ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, డ్రైవర్లు లేదా అప్‌డేట్‌లు - కంప్యూటర్‌ పెర్ఫార్మెన్స్‌ను దెబ్బతీస్తున్నాయని అనుకుంటే, వెంటనే పీసీని రెస్టోరింగ్ (Restoring) చేయాలి. దీని వల్ల మీ కంప్యూటర్‌ నుంచి అవి తొలగిపోతాయి. మీ కంప్యూటర్ ఎప్పటిలానే స్పీడ్‌గా వర్క్ చేస్తుంది.

నోట్‌ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన టిప్స్‌ అన్నీ ఒకేసారి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీకు దేని వల్ల సమస్య ఉందని అనిపిస్తే, దానికి తగిన టిప్‌ను వాడితే సరిపోతుంది. ఒక వేళ మీకు దీనిపై ఏ మాత్రం అవగాహన లేకపోతే, నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details