ETV Bharat / technology

టాటా పంచ్ ధరల పెంపు- ఇప్పుడు అదనంగా రూ.17,090 ఖర్చు చేయాల్సిందే! - TATA PUNCH PRICE HIKE

పాపులర్ పంచ్ ధరలను పెంచిన టాటా మోటార్స్- ఏ వేరియంట్​పై ఎంతంటే?- పూర్తి వివరాలివే..!

Tata Punch
Tata Punch (Photo Credit- Tata Motors)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 14, 2025, 7:11 PM IST

Tata Punch Price Hike: స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన SUV టాటా పంచ్ అరుదైన ఘనత సాధించింది. 2024 సంవత్సరంలో అత్యధిక సేల్స్​ను రాబట్టి 'బెస్ట్​-సెల్లింగ్ కార్' టైటీల్ గెలుచుకుంది. ఈ కారు ఏకంగా మారుతి సుజుకి 40 ఏళ్ల ఆల్​టైమ్ రికార్డ్​ను బద్దలు కొట్టింది. ఈ చారిత్రాత్మక విజయంతో కంపెనీ ఇప్పుడు ఈ టాటా పంచ్ ధరలను సవరించింది. దీని ధరను ఇప్పుడు గరిష్టంగా రూ.17,090 పెంచింది.

టాటా పంచ్ ప్రైజ్ హైక్: కంపెనీ పెంచిన ధరలలో అత్యల్పంగా ఉన్నది ఈ కారులోని బేస్​ ప్యూర్ MT వేరియంట్ రేటే. దీని ధరను రూ.7,090 పెంచింది. ఈ ధరతో టాటా పంచ్ ప్రారంభ ధర ఇప్పుడు రూ. 6,19,990 (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. గతంలో ఈ వేరియంట్ ధర రూ. 6,12,990గా ఉండేది. దీనితో పాటు ప్యూర్ (O) MT, అడ్వెంచర్ S MT, అడ్వెంచర్ S AMT, అడ్వెంచర్+ S MT, అడ్వెంచర్+ S AMT, అకాంప్లిష్డ్+ MT, అకాంప్లిష్డ్+ AMT వేరియంట్ల ధరలను కంపెనీ రూ.12,090 పెంచింది.

రూ. 17,000 గరిష్ట పెంపుతో వేరియంట్లు: వీటితో పాటు అడ్వెంచర్ MT, అడ్వెంచర్ AMT, అడ్వెంచర్ రిథమ్ MT, అడ్వెంచర్ రిథమ్ AMT వేరియంట్‌ల ధరను రూ.17,090 పెంచింది. కంపెనీ తాజాగా పెంచిన ధరలలో ఈ వేరియంట్ల పెరుగుదలే అత్యధికంగా ఉంది. అయితే ఇప్పుడు టాటా పంచ్​ అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్ వేరియంట్లు సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉంటాయి.

ఇవి కాక కంపెనీ ఈ కారులోని అకాంప్లిష్డ్+ S MT, అకాంప్లిష్డ్+ S AMT ధరలను రూ.10,090 పెంచింది. దీనితో పాటు క్రియేటివ్ ట్రిమ్ లెవల్ (పర్సోనా)లో క్రియేటివ్+ S AMT వేరియంట్ ధర కూడా రూ.17,090 పెరిగింది. అదే సమయంలో క్రియేటివ్+ MT, క్రియేటివ్+ AMT, క్రియేటివ్+ S MT వంటి ఇతర వేరియంట్‌ల ధరలు రూ.12,090 పెరుగాయి.

టాటా మోటార్స్ ఇటీవలే టాటా పంచ్ కామో ఎడిషన్‌ను రీ-లాంఛ్ చేసింది. కంపెనీ ప్రస్తుతం దీని ధరను కూడా పెంచింది. ఈ కారులోని క్రియేటివ్+ S AMT కామో వేరియంట్ ధర రూ.17,090 పెరిగింది. అకాంప్లిష్డ్, క్రియేటివ్ పర్సనాలిటీ ఆధారంగా ఉన్న అన్ని ఇతర కామో వేరియంట్‌ల ధరలను రూ.12,090 పెంచింది.

టాటా పంచ్ కొత్త ధరల వివరాలు: కంపెనీ తాజాగా సవరించిన ధరలతో టాటా పంచ్ బేస్ ప్యూర్ MT వేరియంట్‌ రేటు ఇప్పుడు రూ. 6,19,990 నుంచి ప్రారంభమై దీని టాప్-స్పెక్ క్రియేటివ్+ S AMT కామో ఎడిషన్ వేరియంట్‌ ధర రూ. 10,31,990 వరకు ఉంటుంది. ఈ కారు మార్కెట్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అమ్ముడవుతోంది. అయితే ఇందులో పెట్రోల్-CNG ఆప్షన్‌ కూడా ఉంది. దీనితో మాన్యువల్, AMT ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

'ఏప్రిలియా టువోనో 457' బైక్​ లాంఛ్ డేట్ ఫిక్స్- ధర ఎంత ఉండొచ్చంటే?

'మహా కుంభ్'​పై గూగుల్ గులాబీ రేకుల వర్షం!- మీరు కూడా ట్రై చేయొచ్చు- అదెలాగంటే?

పండగ వేళ చౌకైన రీఛార్జ్ ప్లాన్ లాంఛ్- రోజుకు రూ.8 కంటే తక్కువ ఖర్చుతో అన్​లిమిటెడ్ బెనిఫిట్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.