TikTok Layoffs: ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ తన ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న 700 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. AI సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు లేఆఫ్‌లకు సంబంధించిన ఇ-మెయిల్స్ అందినట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల తొలగింపుపై టిక్‌టాక్ కన్ఫార్మ్ చేసింది. అయితే ఎంతమందిని తొలగించిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కంపెనీ తన వ్యూహాత్యక చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కంటెంట్ మోడరేషన్ కోసం గ్లోబల్ ఆపరేషన్ మోడల్‌ను బలోపేతం చేయడానికి చేపడుతున్న ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం కూడా ఒకటని టిక్‌టాక్ ప్రతినిధి తెలిపారు.