ETV Bharat / technology

ఇస్రో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ వాయిదా- కారణం ఏంటంటే? - ISRO SPADEX DOCKING POSTPONED

ఇస్రో లేటెస్ట్ అప్​డేట్- స్పేడెక్స్ డాకింగ్ పోస్ట్​పోన్- రీషెడ్యూల్ ఎప్పుడంటే?

ISRO SpaDeX Docking Postponed
ISRO SpaDeX Docking Postponed (Photo Credit- ISRO)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 6, 2025, 6:34 PM IST

ISRO SpaDeX Docking Postponed: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్​లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ఇస్రో ముందస్తు ప్రణాళిక ప్రకారం.. ఈ డాకింగ్​ ప్రక్రియ జనవరి 7న జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మిషన్​లో డాకింగ్ షెడ్యూల్​ను జనవరి 9కి మార్చినట్లు ఇస్రో ప్రకటించింది.

కాగా ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్​లో శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు.

స్పేడెక్స్ ప్రయోగం ద్వారా PSLV-C60 ఈ రెండు ఉపగ్రహాలను విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రెండూ అంతరిక్షంలోనే డాకింగ్‌, అన్‌డాకింగ్‌ చేసేలా ప్రయోగాన్ని చేపట్టారు. వృత్తాకార కక్ష్యలో 2 ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్‌ చేసేలా శాస్త్రవేత్తలు ప్రణాళిక సిద్ధం చేశారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియ జరగనుంది.

అయితే రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ రేపు జరగనుండగా ఈరోజు మిషన్​లో సమస్యను గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ కారణంగా డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే దీని షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్ ఎక్స్​లో పోస్ట్​​ ద్వారా ప్రకటించింది.

ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఇస్రో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఈ 13 సెకన్ల వీడియోలో స్పేడెక్స్ రెండో శాటిలైట్ అంటే SDX02 (టార్గెట్) ప్రయోగాన్ని చూడొచ్చు. ఈ వీడియో SDX02 లాంఛ్ రెసిస్టెంట్ రిలీజ్ & డాకింగ్ రింగ్ ఎక్స్​టెన్షన్​ను చూపిస్తుంది. అంటే స్పేడెక్స్ లాంఛ్ సమయంలో SDX02 ప్రత్యేక హోల్డ్‌ను ఎలా తీసివేసి, ఆపై డాకింగ్ రింగ్‌ను ఎలా అభివృద్ధి చేసిందో ఇందులో కన్పిస్తుంది.

చంద్రుడిపై వ్యోమగామిని దించడం, చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్​ (ISS)ను నిర్మించాలన్న భారత్‌ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేడెక్స్‌ ప్రయోగాన్ని చేపట్టింది.

ఇంతకీ డాకింగ్, అన్​డాకింగ్ అంటే ఏంటి?:

డాకింగ్: రోదసిలో ఉన్న రెండు వస్తువులను ఒకదానికొకటి అనుసంధానం చేయడాన్నే డాకింగ్​గా పిలుస్తారు. ఇప్పుడు ఇస్రో చేపట్టిన ఈ స్పేడెక్స్ మిషన్​లో ప్రయోగించిన ఛేజర్ అనే శాటిలైట్ దానితోపాటే అంతరిక్షంలోకి పంపించిన టార్గెట్ అనే మరో ఉపగ్రహాన్ని కనుగొని దానికి కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్షన్ రెండు రైలు కోచ్​లు ఒకదానికొకటి కనెక్ట్ చేసినట్లుగా ఉంటుంది.

అన్‌డాకింగ్: డాకింగ్ వ్యతిరేక ప్రక్రియను అన్‌డాకింగ్ అంటారు. ఈ రెండు ఉపగ్రహాలు ఒకదాని నుంచి మరొకటి విడిపోయినప్పుడు ఆ ప్రాసెస్​ను అన్‌డాకింగ్​గా పిలుస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్​గా జరుగుతుంది. దీంతో దీన్ని అటానమస్ డాకింగ్ అంటారు.

స్పేడెక్స్ మిషన్ హైలెట్స్:

ఈ మిషన్ SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు చిన్న ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. వీటిలో ఒక్కో శాటిలైట్ బరువు దాదాపు 220kg ఉంటుంది. ఈ ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. ఆ తర్వాత ఇవి అత్యాధునిక సెన్సార్స్, అల్గారిథమ్​లను ఉపయోగించి ఒకదానినొకటి గుర్తించి అనుసంధానం అవుతాయి.

ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్​ను కొన్ని దేశాలు మాత్రమే చేయగలిగాయి. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం అయితే అటానమస్ డాకింగ్ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరనుంది. ఈ ప్రయోగంతో ప్రపంచంలో ఇంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. అయితే జనవరి 9, 2024న ఈ మిషన్ గురించి ఇస్రో ఎలాంటి అప్‌డేట్ ఇస్తుందో చూడాలి.

సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత

సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్'

'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ!

2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? అవి ఏ రాశులపై ప్రభావం చూపిస్తాయి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.