తెలంగాణ

telangana

ETV Bharat / technology

కొత్త కారు కొనాలా?- అయితే మారుతి డిజైర్​పై ఓ లుక్కేయండి- ​వేరియంట్ వారీగా ఫీచర్లు ఇవే..! - 2024 MARUTI DZIRE

మారుతి డిజైర్​లో బెస్ట్ ఆప్షన్ ఏది?- టాప్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండిలా!

2024 Maruti Dzire
2024 Maruti Dzire (Maruti Suzuki)

By ETV Bharat Tech Team

Published : Nov 13, 2024, 3:18 PM IST

2024 Maruti Dzire: మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇటీవలే మారుతి సుజుకి తన కొత్త మారుతి డిజైర్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లాంఛ్ చేసింది. ఈ కారును మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించారు. ఇది ఒకే ప్లాట్​ఫారమ్, ఇంజిన్​ను ఉపయోగిస్తుంది. అయితే ఈ కారు లుక్ చాలా భిన్నంగా ఉంటుంది.

అంతేకాక మారుతి స్విఫ్ట్, దాని పాత మోడల్​లో పోలిస్తే దీని ఎక్విప్మెంట్ పరంగా కూడా ఇది ఒక అడుగు ముందుంది. కంపెనీ ఈ కొత్త మారుతి డిజైర్‌ను రూ. 6.79 లక్షల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. అయితే టాప్-స్పెక్ మోడల్ ధర రూ. 10.14 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ). నాలుగు ట్రిమ్ ఆప్షన్లలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మారుతి డిజైర్​ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.

2024 మారుతి సుజుకి డిజైర్ ట్రిమ్స్:కంపెనీ ఈ కొత్త మారుతి డిజైర్​ను నాలుగు ట్రిమ్ ఆప్షన్స్​లో తీసుకొచ్చింది.

  • LXi
  • VXi
  • ZXi
  • ZXi+

పవర్​ట్రెయిన్ అండ్ మైలేజ్:కొత్త మారుతి డిజైర్ స్విఫ్ట్ మాదిరిగానే ఇందులో కూడా 1.2-లీటర్, 3-సిలిండర్, Z12E పెట్రోల్ ఇంజిన్​ ఉంటుంది. ఇది 80 bhp పవర్​, 112 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్​తో నాలుగు ట్రిమ్​లలో స్టాండర్డ్​గా వస్తుంది. ఇది కాకుండా కొత్త డిజైర్ లాంచ్ తర్వాత CNG పవర్‌ట్రైన్‌ను కూడా అందుబాటులో ఉంది. ఇది మిడ్-స్పెక్ VXi, ZXi ట్రిమ్‌లలో లభిస్తుంది.

CNG పవర్‌ట్రెయిన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్​తోనే వస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ CNG ఫ్యూయల్​పై 68 bhp పవర్​, 101.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త డిజైర్ ARAI-రేటెడ్ మైలేజ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 24.79kpl, AMT గేర్‌బాక్స్‌తో 25.71kpl. అదే సమయంలో దీని CNG వేరియంట్‌లపై 33.73km/kg మైలేజీని అందిస్తుంది.

2024 మారుతి సుజుకి డిజైర్ వేరియంట్ వారీగా ఫీచర్లు:

1. 2024 Maruti Dzire LXi:

  • పవర్‌ట్రెయిన్:పెట్రోల్-MT
  • ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్‌లైట్స్
  • LED టెయిల్-లైట్స్
  • కవర్లు లేకుండా 14-అంగుళాల స్టీల్ వీల్స్
  • షార్క్ ఫిన్ యాంటెన్నా
  • బ్లాక్ అండ్ లేత గోధుమరంగు డ్యూయల్ టోన్ ఇంటీరియర్
  • ఫాబ్రిక్ సీటు అప్హోల్స్టరీ
  • అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ హెడ్​రెస్ట్
  • MID (మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే)తో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
  • నాలుగు పవర్ విండోస్
  • ఆటో అప్​/డౌన్ ఫర్ డ్రైవర్ సైడ్ విండో
  • కీలెస్ ఎంట్రీ
  • మాన్యువల్ AC
  • టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్
  • ఆరు ఎయిర్‌బ్యాగులు
  • రియర్ డీఫాగర్
  • అన్ని సీట్లకు రిమైండర్‌తో 3-పాయింట్ సీట్ బెల్ట్
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
  • హిల్-హోల్డ్ అసిస్ట్
  • EBDతో ABS
  • రివర్స్ పార్కింగ్ సెన్సార్
  • ధర:రూ. 6.79 లక్షలు

2. 2024 Maruti Dzire VXi:

  • పవర్‌ట్రెయిన్: పెట్రోల్-MT, పెట్రోల్-AMT, CNG-MT
  • కవర్లతో కూడిన 14-అంగుళాల స్టీల్ వీల్స్
  • ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ ఫినిష్
  • వింగ్ మిర్రర్​పై టర్న్ ఇండికేటర్
  • బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ వింగ్ మిర్రర్స్
  • ఎలక్ట్రికల్​ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ వింగ్ మిర్రర్స్
  • డాష్‌బోర్డ్​పై సిల్వర్ ఇన్సర్ట్
  • 7-అంగుళాల టచ్‌స్క్రీన్
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లే
  • 4-స్పీకర్స్
  • స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్
  • OTA అప్​డేట్​
  • వాయిస్ అసిస్టెంట్
  • USB అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ
  • హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్
  • అడ్జస్టబుల్ రియర్ హెడ్​రెస్ట్
  • డే/నైట్ ఇన్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ (IRVM)
  • ఫ్రంట్ రూఫ్ ల్యాంప్
  • రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ విత్ కప్‌హోల్డర్‌
  • రియర్ AC వెంట్స్
  • ధర: రూ. 7.79 లక్షలు - 8.74 లక్షలు

3. 2024 Maruti Dzire ZXi:

  • పవర్‌ట్రెయిన్: పెట్రోల్-MT, పెట్రోల్-AMT, CNG-MT
  • ఆటో LED హెడ్‌లైట్స్
  • LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్
  • 15-అంగుళాల సింగిల్-టోన్ అల్లాయ్ వీల్స్
  • క్రోమ్ విండో గార్నిష్
  • డాష్‌బోర్డ్‌లో సిల్వర్ ట్రిమ్ అండ్ ఫాక్స్ ఉడ్ ఇన్‌సర్ట్‌లు
  • పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
  • వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
  • కీ-ఆపరేటెడ్ బూట్ ఓపెనింగ్
  • ఆటో AC
  • 6 స్పీకర్లు (2 ట్వీటర్‌లతో సహా)
  • కనెక్టెడ్​ కార్ టెక్నాలజీ
  • రివర్స్ పార్కింగ్ కెమెరా
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)
  • ధర:రూ. 8.89 లక్షలు - 7.84 లక్షలు

2024 Maruti Dzire ZXi+:

  • పవర్‌ట్రెయిన్: పెట్రోల్-MT, పెట్రోల్-AMT
  • 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్
  • LED ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • ఫ్రంట్ ఫుట్‌వెల్ లైట్
  • లెథర్​తో చుట్టిన స్టీరింగ్ వీల్
  • 9-అంగుళాల టచ్‌స్క్రీన్
  • అర్కామిస్-ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్
  • సింగిల్ పేన్ సన్‌రూఫ్
  • ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లో కలర్ MID
  • క్రూయిజ్ కంట్రోల్
  • కారు లాక్ చేసేటప్పుడు ఆటో ఫోల్డ్ వింగ్ మిర్రర్స్
  • 360-డిగ్రీ కెమెరా
  • ధర: రూ. 9.69 లక్షలు - రూ. 10.14 లక్షలు

మారుతి సుజుకి ఈ కొత్త డిజైర్​ను రిలీజ్ చేసినప్పటి నుంచే ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. కేవలం 11,000 అడ్వాన్స్​ చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లేదా అధికారిక డీలర్‌షిప్ నుంచి ఈ కారును బుక్​ చేసుకోవచ్చు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ధరలు కంపెనీ స్టార్టింగ్ ప్రైజెస్. ఇవి డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తాయి.

వీటికి పోటీ: ఇండియాలో ఈ కొత్త మారుతి డిజైర్.. హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్‌లకు పోటీగా ఉంది.

నేడే హాట్‌స్టార్​లో జియో సినిమా విలీనం- కొత్త డొమైన్ ఇదేనా?

మీరు యాపిల్ డివైజస్ వాడుతున్నారా?- అయితే కేంద్రం హైరిస్క్ అలర్ట్- వెంటనే ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details