Moto G05 Launched in India: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరే వార్త. ఈ న్యూ ఇయర్లో బడ్జెట్ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా మోటో జీ05 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. దీనిలో అనేక అప్‌గ్రేడ్లు ఉన్నాయి. మెరుగైన కెమెరాలు, ఫాస్ట్ ప్రాసెసర్, మరింత శక్తివంతమైన బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం.
అంతేకాదండోయ్ ఇది స్టైలిష్ వేగన్ లెదర్ డిజైన్‌తో వస్తుంది. ప్రత్యేకించి పాంటోన్ క్యూరేట్ చేసిన ప్రత్యేక రంగుల్లో ఈ మొబైల్ లభిస్తుంది. అయితే ఇన్ని ప్రత్యేక ఫీచర్లతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.6,999లకే తీసుకురావడం విశేషం. మరెందుకు ఆలస్యం ఈ కొత్త మోటో జీ05 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
మోటో జీ05 ఫీచర్లు:
- డిస్ప్లే: 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ
- రిఫ్రెష్ రేటు: 90Hz
- పీక్ బ్రైట్‌నెస్: 1,000 నిట్స్
- ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్‌ట్రీమ్
- బ్యాటరీ: 5,200mAh
- 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- బ్యాక్ కెమెరా: 50MP
- ఫ్రంట్ కెమెరా: 8MP
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.0
- 3.5 ఎంఎం ఆడియో జాక్
- USB టైప్-C పోర్ట్
మోటో జీ05 కలర్ ఆప్షన్స్: మోటోరొలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అదిరిపోయే రెండు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. ఈ రెండు రంగులు కూడా వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తున్నాయి.
- ఫారెస్ట్ గ్రీన్
- ప్లమ్ రెడ్
వేరియంట్స్: కంపెనీ ఈ మొబైల్‌ను కేవలం ఒక్క వేరియంట్లోనే తీసుకొచ్చింది.
- 4GB+ 64GB
మోటో జీ05 ధర:
- 4GB+ 64GB వేరియంట్ ధర: రూ.6,999
ఈ ఫోన్ ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో వస్తోంది. కంపెనీ మైక్రో ఎస్‌డీ కార్డ్ సాయంతో ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ పెంచుకొనే సదుపాయం కల్పిస్తోంది. IP52 రేటింగ్‌తో ఈ మొబైల్‌ను తీసుకొచ్చారు. ఈ కొత్త ఫోన్‌ను జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు. గతేడాది విడుదలైన మోటో G04 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది.
శాంసంగ్ ప్రియులకు గుడ్‌న్యూస్- గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో
సిట్రోయెన్ బసాల్ట్ SUV ధర పెంపు- గరిష్టంగా రూ.28,000!- ఇప్పుడు దీని రేటెంతంటే?