Galaxy Unpacked Event 2025: శాంసంగ్ ప్రియులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2025 డేట్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్ జనవరి 22న USAలోని శాన్ జోస్‌లో జరగనుంది. శాంసంగ్ ఈ ప్రోగ్రాంలో తన గెలాక్సీ S25 సిరీస్‌ను లాంఛ్ చేయనుంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్ కొత్త సిరీస్ అంటే గెలాక్సీ S లైనప్‌ను ప్రతి ఏడాది జనవరిలో విడుదల చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్లో తీసుకొచ్చే స్మార్ట్‌ఫోన్ మోడల్స్, వాటిలోని ఫీచర్ల వివరాలను తెలుసుకునేందుకు శాంసంగ్ లవర్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర స్మార్ట్‌ఫోన్ వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే మార్కెట్లో గెలాక్సీ ఈ S సిరీస్ ప్రత్యక్ష పోటీ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ లేటెస్ట్ సిరీస్‌తో ఉంటుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది జరగబోయే ఈవెంట్‌ను గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 పేరుతో నిర్వహిస్తుంచనున్నారు. ఈ ఈవెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో దీని వివరాలను కంపెనీ తన అధికారిక న్యూస్‌రూమ్ పోస్ట్ ద్వారా షేర్ చేసింది. ఈ ఈవెంట్ జనవరి 22న భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు జరగనుంది. ఇది Samsung.com, Samsung newsroom, Samsung అధికారిక YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈసారి కంపెనీ గెలాక్సీ S25 సిరీస్‌లో గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా అనే మూడు మోడల్స్‌ను తీసుకురానుంది. ఈ అప్‌కమింగ్ మొబైల్స్ ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ (AI)తో రానున్నాయి. ఈ గెలాక్సీ ఏఐ కొత్త వెర్షన్ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చనుంది. దీంతో ఏఐ ప్రపంచంలో ఈ సిరీస్ సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.
కంపెనీ ఈ అప్‌కమింగ్ స్మార్ట్ఫోన్ల ప్రీ-రిజర్వేషన్లను ఇండియాలో ప్రారంభించింది. శాంసంగ్ ఇండియా స్టోర్‌ను సందర్శంచి కస్టమర్లు రూ.1,999 టోకెన్ అమౌంట్‌ను చెల్లించి వీఐపీ పాస్‌ను పొందొచ్చు. దీని ద్వారా ఈ అప్‌కమింగ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు రూ.5,000 ఇ-స్టోర్ వోచర్ రూపంలో అనేక ప్రయోజనాలను పొందొచ్చని శాంసంగ్ తెలిపింది. అంతేకాక వారు రూ. 50,000 విలువైన బహుమతిని కూడా గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇండియన్ మార్కెట్లో వీటి లాంఛ్, ధరల వివరాలపై శాంసంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌పై అంచనాలు: ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ అభివృద్ధి దశలో ఉంది. కాబట్టి దీని గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇండస్ట్రీ ట్రెండ్స్ ప్రకారం..
- ఇది Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో శాంసంగ్ One UI 6.0 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
- ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 లేదా శక్తివంతమైన Exynos చిప్‌సెట్‌ని కలిగి ఉండొచ్చు.
- S25, S25+లో AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz లేదా అంతకంటే ఎక్కువ.
- S25 అల్ట్రా లార్జ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. ఇది మెరుగైన రిఫ్రెష్ రేట్, బ్రైట్‌నెస్‌ను కూడా కలిగి ఉంటుంది.
- S25, S25+ మూడు కెమెరాలను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ కాంతిలో కూడా గ్రేట్ ఫొటోస్ అండ్ వీడియోలను రికార్డ్ చేయగలవు.
- ఇక S25 అల్ట్రా 200MP మంచి ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీని సహాయంతో జూమింగ్లో కూడా మంచి పిక్చర్లను క్లిక్ చేయొచ్చు.
- వీటితో పాటు ఈ సిరీస్ అనేక ఏఐ ఫీచర్లతో రానున్నాయి. అంతేకాక ఈ ఫోన్లు బిగ్ బ్యాటరీని కలిగి ఉండి చాలా వేగంగా ఛార్జ్ అవుతాయి.
ప్రీమియం ఫీచర్లతో వన్‌ప్లస్ 13 సిరీస్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!
అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో
సిట్రోయెన్ బసాల్ట్ SUV ధర పెంపు- గరిష్టంగా రూ.28,000!- ఇప్పుడు దీని రేటెంతంటే?