Upcoming Flagship Phones in India:మీరు కొత్త ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇండియన్ మార్కెట్లోకి చాలా కాలం తర్వాత కొన్ని ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ రానున్నాయి. టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు Qualcomm, MediaTek లేటెస్ట్ ప్రాసెసర్‌లతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో OnePlus, Oppo, iQOO, Vivo, Realme, Xiaomi వంటి కంపెనీలు ఉన్నాయి.
Realme GT 7 Pro:రియల్మీ ఇండియాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో Realme GT 7 ప్రో మొబైల్‌ను తీసుకురానుంది. దీని ప్రీవియస్ మోడల్స్‌తో పోలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ CPU, GPU, AI పనితీరు పరంగా ఇది టాప్‌లో ఉంటుంది. ఈ మొబైల్ మార్కెట్లోకి నవంబర్ ప్రారంభంలో రిలీజ్ కానుంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో హై-రిజల్యూషన్ 2K డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. ఇది 6,500 mAh బిగ్ బ్యాటరీతో రావొచ్చు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని సమాచారం. ఈ మొబైల్ IP69 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్, గరిష్టంగా 12 GB RAM, 512 GB వరకు స్టోరేజీతో వస్తుంది.
Oppo Find X8 Pro:ఒప్పో చాలా కాలంగా ఇండియన్ మార్కెట్లో ఏ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు కంపెనే తన Oppo Find X8 Pro మొబైల్‌ను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించొచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను చాలా స్లిమ్‌గా తీసుకొస్తుందని సమాచారం. ఫైండ్ X8 ప్రోలో MediaTek డైమెన్సిటీ 9400 చిప్ ఉంటుంది. దీని మందం 7.85 మిమీ ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్‌ను 5,700 mAh బిగ్ బ్యాటరీతో తీసుకురావొచ్చు.
IQOO 13:దీని ప్రీవియస్ మోడల్స్లానే iQOO 13 కూడా పెర్ఫార్మెన్స్- ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ కావచ్చు. కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ BMW మోటార్‌స్పోర్ట్స్ బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే కొత్త IQOO 13లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాక Qualcomm లేటెస్ట్ చిప్‌తో అత్యంత సరసమైన ధరలో లాంచ్ అవ్వొచ్చు. ఇది 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్, 2K రిజల్యూషన్ స్క్రీన్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,100 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.