Oppo Reno 13 Series: ఒప్పో రెనో 13 సిరీస్ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ సిరీస్‌లో కంపెనీ రెండు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. వాటిలో మొదటిది ఒప్పో రెనో 13 5G, ఇక రెండోది ఒప్పో రెనో 13 ప్రో 5G. ఈ రెండు మోడల్ స్మార్ట్ఫోన్లూ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్తో రన్ అవుతాయి. అంతేకాక వీటిలో 50-50MP ఫ్రంట్ కెమెరాలను అమర్చారు. మరెందుకు ఆలస్యం వీటి ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఒప్పో రెనో 13 5G స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ 6.59- అంగుళాల స్మార్ట్ అడాప్టివ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది.
- ప్రాసెసర్: ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ ఉంటుంది. దీంతోపాటు కంపెనీ గ్రాఫిక్స్ కోసం ఇందులో GPU Mail-G615, NPU 780ను అందించింది.
- సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS పై రన్ అవుతుంది.
- RAM: ఈ ఫోన్‌లో 8GB LPDDR5X ర్యామ్ ఉంది. ఇది ఒప్పో RAM ఎక్స్‌పాన్షన్ టెక్నాలజీతో వస్తుంది.
- స్టోరేజీ: ఈ ఫోన్‌లో 128GB అండ్ 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
- వెనక కెమెరా: ఈ ఫోన్ వెనక భాగంలో 50MP సోనీ LYT-600 మెయిన్ కెమెరా, 8MP OV08D అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా: ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 50MP శాంసంగ్ S5KJN5 కెమెరా సెన్సార్ ఉంది.
- బ్యాటరీ: ఈ ఫోన్ 5600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- కలర్ ఆప్షన్స్: ఈ ఫోన్‌ను ఐవరీ వైట్, లుమినియం బ్లూ కలర్ ఆప్షన్లతో లాంఛ్ చేశారు.
- ఇతర ఫీచర్లు: ఈ ఫోన్‌లో IP66 + IP68 + IP69 రేటింగ్, బ్లూటూత్ 5.4 LE, Wi-Fi 6 వంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
ఒప్పో రెనో 13 ప్రో 5G స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: ఈ ఫోన్ 6.83-అంగుళాల స్మార్ట్ అడాప్టివ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
- ప్రాసెసర్: ఈ ఫోన్ ప్రాసెసర్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, గ్రాఫిక్స్ కోసం GPU Mail-G615 మరియు NPU 780లను కూడా ఉపయోగిస్తుంది.
- సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 పై నడుస్తుంది.
- RAM: ఈ ఫోన్‌లో 12GB LPDDR5X ర్యామ్ ఉంది.
- స్టోరేజీ: ఈ ఫోన్‌లో 256GB అండ్ 512GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
- బ్యాక్ కెమెరా: ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP సోనీ IMX890 మెయిన్ కెమెరా, 50MP శామ్‌సంగ్ S5KJN5 సెకండ్ కెమెరా ఉన్నాయి. ఇది 3.5 ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ థర్డ్ కెమెరా 8MP OV08D అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది.
- ఫ్రంట్ కెమెరా: సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 50MP శాంసంగ్ S5KJN5 కెమెరా సెన్సార్‌ను అందించారు. దీని ఎపర్చరు f/2.0.
- బ్యాటరీ: ఈ ఫోన్ 5800mAh బ్యాటరీ, 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
- కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ ఫోన్ మిస్ట్ లావెండర్, గ్రాఫైట్ గ్రే రంగులలో తీసుకొచ్చింది.
- ఇతర ఫీచర్లు: ఈ ఫోన్‌లో IP66 + IP68 + IP69 రేటింగ్, బ్లూటూత్ 5.4 LE, Wi-Fi 6 వంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
ఒప్పో రెనో 13 5G వేరియంట్స్: ఈ మోడల్లో రెండు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి.
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
ఒప్పో రెనో 13 ప్రో 5G వేరియంట్స్: కంపెనీ ఈ మోడల్లో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది.
- 12GB RAM + 256GB స్టోరేజ్
- 12GB RAM + 512GB స్టోరేజ్
ఒప్పో రెనో 13 5G ధర:
- ఒప్పో రెనో 13 5G మొదటి వేరియంట్ 8GB RAM అండ్ 128GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 37,999.
- ఇక 8GB RAM అండ్ 256GB స్టోరేజీతో ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ సెకండ్ వేరియంట్ ధర 39,999.
ఒప్పో రెనో 13 ప్రో 5G ధర:
- ఒప్పో రెనో 13 ప్రో 5G ఫస్ట్ వేరియంట్ 12GB RAM అండ్ 256GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 49,999
- ఈ మోడల్లో సెకండ్ వేరియంట్ 12GB RAM అండ్ 512GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.54,999.
ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో వీటి సేల్స్ జనవరి 11 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్లను కొనుగోలు చేసే సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా పేమెంట్ చేయడం ద్వారా 10% ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను కూడా పొందొచ్చు.
కొత్త నంబర్ల నుంచి మిస్డ్కాల్స్ వస్తున్నాయా?- తిరిగి చేశారో ఇక అంతే!- అలాంటి సమయంలో ఏం చేయాలంటే?
Jio vs Airtel: తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ- బెస్ట్ రీఛార్స్ ప్లాన్స్ ఇవే!