ETV Bharat / offbeat

కూరలో పులుపు ఎక్కువైందా? - డోంట్​వర్రీ, ఇలా చేస్తే రుచిని ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు! - TIPS TO REDUCE SOURNESS IN CURRY

వంటల్లో పులుపు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? - ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుందంటున్న నిపుణులు!

HOW TO REDUCE EXCESS SOUR IN CURRY
Tips to Reduce Sourness in Curries (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2025, 4:11 PM IST

Best Tips to Reduce Sourness in Curries : ఏ కూరలోనైనా ఉప్పు, కారం, పసుపు, మసాలాలు ఇలా అన్ని పదార్థాలు సరిగ్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కానీ, అనుకోకుండా కొన్నిసార్లు కూరలు వండే క్రమంలో కారం, ఉప్పు ఎక్కువైపోతుంటాయి. అయితే, ఇవి మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో పులుపు కూడా ఎక్కువై పోతుంది. ఆ టైమ్​లో పులుపుని బాగా ఇష్టపడేవారూ తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. దీంతో ఆ కూరల్ని పక్కన పెట్టేస్తుంటారు. అలాకాకుండా కర్రీల్లో పులుపు ఎక్కువైనప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. పులుపు తగ్గడమే కాకుండా కూరలకు అదనపు రుచి వస్తుందంటున్నారు. మరి, ఆ టిప్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బంగాళాదుంపలు : కూరల్లో పులుపు ఎక్కువైతే ఈ టిప్ ఫాలో అవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటంటే గ్రేవీలో సగం ఉడికించిన ఒక ఆలుగడ్డ ముక్కలను వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి. అప్పుడు కర్రీలోని పులుపుని ఆలూ బ్యాలెన్స్​ చేస్తుంది. ఒకవేళ మీకు కూరలో బంగాళదుంప ముక్కలు నచ్చకపోతే అవి ఉడికాక తీసేయొచ్చు.

బెల్లం : కర్రీలో ఎక్కువైన పులుపుని తగ్గించడంలో ఇదీ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, కర్రీ టేస్ట్​ని​ మరింత పెంచి సరికొత్త రుచిని అందిస్తుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా పులుపు ఎక్కువైన కూరలో కొద్దిగా బెల్లాన్ని వేసి బాగా కలిపి కాసేపు ఉడించుకుంటే చాలు. కానీ, మరీ ఎక్కువగా మాత్రం వేయొద్దు. ఇలా వేస్తే కర్రీ టేస్ట్ మరీ స్వీట్​గా, డిఫరెంట్​గా ఉంటుందని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు!

వంటసోడా : ఎక్కువ మంది దీన్ని వివిధ వంటకాల్లో వాడుతుంటారు. కానీ, వంటసోడా పులుపుని కూడా తగ్గిస్తుందని చాలా మందికి తెలియదు. కూరలో పులుపు ఎక్కువైనప్పుడు చిటికెడు బేకింగ్ సోడా వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలాగే దీన్ని ఎక్కువగా వేస్తే కర్రీ టేస్ట్ పోతుందని గుర్తుంచుకోవాలి.

పాల మీగడ : ఈ టిప్ కూడా కర్రీలో ఎక్కువైన పులుపుని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా పులుపు ఎక్కువగా ఉన్న కూరలో 1 టీస్పూన్ పాల మీగడ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడికించుకుంటే ఆ క్రీమ్ గ్రేవీలో చక్కగా కలిసి పులుపు తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఇవేకాకుండా కర్రీలో పులుపు ఎక్కువైతే ఉప్పు కలిపినా సరిపోతుందని చెబుతున్నారు. అయితే, సాల్ట్ కలిపేటప్పుడు రుచి చూసుకుంటూ కలుపుకోవడం వల్ల ఎక్కువ కాకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు.

కర్రీలో నూనె ఎక్కువైందా ?- ఈ టిప్స్​తో ఆయిల్​ తగ్గడమే కాదు టేస్ట్​ కూడా సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.