ETV Bharat / technology

మార్కెట్లో ఒకేసారి 3 కార్లు లాంఛ్- ఫీచర్లు చూస్తే పిచ్చేక్కిపోవాల్సిందే!- ధర కూడా రూ.5 లక్షల లోపే! - TATA CARS GET 2025 UPDATE

2025 టాటా టియాగో, టియాగో EV, టిగోర్ లాంఛ్- ధర, ఫీచర్ల వివరాలివే!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

Tata Cars Get 2025 Update: వాహన ప్రియులకు గుడ్​న్యూస్. ఈ ఏడాది మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మార్కెట్లోకి ఒకేసారి అదిరే ఫీచర్లతో మూడు కార్లు ఎంట్రీ ఇచ్చాయి. దేశంలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న టాటా మోటార్స్ వీటిని తీసుకొచ్చింది.

తక్కువ ధరలో నాణ్యమైన కార్లను అందించడంలో ఈ సంస్థకు తమదైన గుర్తింపు ఉంది. టాటా మోటార్స్ నుంచి వచ్చిన టియాగో, టిగోర్ మోడల్స్ అత్యంత ప్రజాదరణను పొందాయి. ఇవి ఇండియన్ మార్కెట్లో మంచి సేల్స్​ను రాబట్టి కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టాయి. వీటి EV వెర్షన్‌ కూడా ఈ లైనప్​ను మరింత బలోపేతం చేస్తున్నాయి. దీంతో కంపెనీ ఇప్పుడు ఈ కార్లను MY25 ఫీచర్లతో అప్​డేట్ చేసి రిలీజ్ చేసింది.

టాటా టియాగో (ICE and EV) అప్​డేట్స్: అత్యంత ప్రజాదరణ పొందిన ఇండికా కారుకు సక్సెసర్​గా కంపెనీ టాటా టియాగోను ప్రారంభించింది. ఇది మోస్ట్ అఫర్డబుల్ అండ్ ఎంట్రీ లెవల్ కారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీ ఈ కారును ఇప్పటికే చాలాసార్లు అప్​డేట్ చేసింది. తాజాగా మరిన్ని అప్​డేట్​లతో 2025 టాటా టియాగోను ఇండియాలో ప్రారంభించింది.

టియాగో పెట్రోల్, పెట్రోల్ + CNG వేరియంట్లను కంపెనీ అలాగే ఉంచింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 8.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). మరోవైపు దాని ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 టియాగో EV కారును రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చింది.

2025 Tata Tiago Prices
2025 Tata Tiago Prices (Photo Credit- Tata Motors)

దీని డిజైన్ విషయానికి వస్తే.. 2025 టియాగో, టియాగో EV కార్లకు కొత్త అప్పర్ ఫ్రంట్ గ్రిల్ అందించారు. దీంతో ఇకపై ఇది ఇప్పటి వరకూ కొనసాగిన ట్రై-యారో ప్యాటెర్న్​ను కలిగి ఉండదు. అంతేకాక కంపెనీ వీటిని కొత్త క్యాండీ కలర్స్​లో తీసుకొచ్చింది. దీని ICE మోడల్ లోవర్ గ్రిల్‌లో క్షితిజ సమాంతరంగా కాంట్రాస్టింగ్ క్రోమ్ ఎలిమెంట్స్​ను కలిగి ఉంది. టియాగో EV లోవర్ గ్రిల్ బాడీ-కలర్డ్ ఎలిమెంట్స్​తో వస్తుంది.

ఇది కాకుండా ఈ రెండు కార్లలోనూ కొత్త హెడ్‌లైట్లు అందించారు. ఈ రెండూ LED రిఫ్లెక్టర్ సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇది హాలోజన్ ప్రొజెక్టర్ సెటప్​లో ఉంటుంది. LED DRLలు, ఫాగ్ లైట్లు అలాగే ఉంచారు. వీటి ఫ్రంట్ బంపర్ షేప్​ కూడా​ అలాగే ఉంది. ఇక దీని 15-అంగుళాల అల్లాయ్ వీల్ డిజైన్ ICE మోడల్‌ మాదిరిగానే ఉంటుంది.

కారులోని ఇతర ఎక్స్​టీరియర్ మార్పులలో షార్క్-ఫిన్ యాంటెన్నా కూడా ఉంది. దీని ఇంటీరియర్ ఇప్పుడు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు కారు పుష్-బటన్ స్టార్ట్, ఇల్యూమినేటెడ్ లోగోతో టాటా నెక్సాన్ మాదిరిగా న్యూ టూ-స్పోక్ స్టీరింగ్‌ను కలిగి ఉంది. దీనికి అధునాతన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లభిస్తుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో క్రూయిజ్ కంట్రోల్, TPMS, టైప్-C ఛార్జింగ్ పోర్ట్​తో పాటు అనేక ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

2025 Tata Tiago EV Prices
2025 Tata Tiago EV Prices (Photo Credit- Tata Motors)

2025 టాటా టిగోర్ అప్​డేట్స్: టాటా టియాగో, టియాగో EV లతో పాటు కంపెనీ టిగోర్ ICE మోడల్‌ను కూడా అప్​డేట్ చేసింది. అయితే 2025 టిగోర్ EV గురించి కంపెనీ ఎటువంటి సమాచారం అందలేదు. అయితే 2025 టిగోర్ సూపర్​ఫిషియల్ లెవెల్​లో 2025 టియాగో మాదిరిగానే ముందు భాగాన్ని కలిగి ఉంది. దీని అప్పర్​ గ్రిల్‌పై క్రోమ్ హైలైట్స్​ను కలిగి ఉంది. ఇది ప్రత్యేకమైన విజువల్ డిఫరెన్స్​ను క్రియేట్ చేస్తుంది.

2025 టిగోర్​లో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. అయితే కొత్త టిగోర్​లో ఇప్పుడు 2025 టియాగో కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది XZ+ ట్రిమ్ ఆధారంగా అదిరే ఫీచర్లతో కొత్త లక్స్ టాప్-వేరియంట్‌ను కలిగి ఉంది.

2025 Tata Tigor Prices
2025 Tata Tigor Prices (Photo Credit- Tata Motors)

ఇంకా దీనిలో ఉన్న ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఈ కారులో పుష్-బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. వీటితో పాటు ఇందులో ప్రత్యేక ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్, టాటా నెక్సాన్ మాదిరిగా కొత్త లెదర్-రాప్డ్ 2-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను అందించారు.

టియాగో ICE, టియాగో EV, టిగోర్ మోడల్స్ పవర్‌ట్రెయిన్: 2025 టియాగో, 2025 టిగోర్ కార్లలో ఇప్పటికే ఉన్న 1.2-లీటర్, 3-సిలిండర్ NA పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది డ్యూయల్-సిలిండర్ i-CNG టెక్నాలజీ ఆప్షన్​ను కూడా కలిగి ఉంది. అదే సమయంలో 2025 టియాగో EV మునుపటి లాగానే 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 315 కిలోమీటర్ల రేంజ్​ను అందిస్తుంది.

50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, పవర్​ఫుల్ ప్రాసెసర్​తో ఒప్పో రెనో 13 సిరీస్- ధర ఎంతంటే?

ఐఫోన్ మీపై నిఘా పెడుతోందా?- మీ మాటలు సీక్రెట్​గా రికార్డ్ చేస్తోందా?- సిరి దుర్వినియోగంపై యాపిల్ సమాధానమిదే!

కొత్త నంబర్ల నుంచి మిస్డ్​కాల్స్ వస్తున్నాయా?- తిరిగి చేశారో ఇక అంతే!- అలాంటి సమయంలో ఏం చేయాలంటే?

Jio vs Airtel: తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ- బెస్ట్ రీఛార్స్ ప్లాన్స్ ఇవే!

ఇస్రో స్పేడెక్స్ డాకింగ్ మరోసారి వాయిదా- ఇన్నిసార్లు పోస్ట్​పోన్ ఎందుకు?- శాస్త్రవేత్తల ముందున్న సవాల్ అదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.