Poco X7 5G and Poco X7 Pro 5G Launched: ఇండియన్ మార్కెట్లోకి మరో రెండు కొత్త 5G స్మార్ట్ఫోన్లు వచ్చాయి. షావోమి అనుబంధ మొబైల్ తయారీ సంస్థ పోకో వీటిని తీసుకొచ్చింది. పోకో X7 5G, పోకో X7 ప్రో 5G పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లలోనూ కెమెరాల పరంగా పెద్దగా మార్పులు లేవు. అయితే వీటి బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా కంపెనీ కొన్ని మార్పులు చేసింది. ఈ సందర్భంగా ఈ స్మార్ట్ఫోన్ల ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు మీకోసం.
పోకో X7 5G ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.67 అంగుళాల 1.5k కర్వ్‌డ్ అమోలెడ్
- రిఫ్రెష్ రేటు: 120Hz
- ప్రాసెసర్: మీడియాటెక్ 7300 అల్ట్రా
- బ్యాటరీ: 5,500 ఎంఏహెచ్
- 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్
- కెమెరా సెటప్: ఈ స్మార్ట్‌ఫోన్ వెనక వైపు 50MP మెయిన్ కెమెరా ఉంది. ఇది ఆప్టికల్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. దీనితో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ఉంది.
వేరియంట్స్: కంపెనీ ఈ పోకో X7 5G మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.
- 8GB+128GB
- 8GB+256GB
కలర్ ఆప్షన్స్:
- కాస్మిక్ సిల్వర్
- గ్లేసియర్ గ్రీన్
- పోకో ఎల్లో షేడ్స్
ధరలు:
- 8GB+128GB వేరియంట్ ధర: రూ. 21,999
- 8GB+256GB వేరియంట్ ధర: రూ. 23,999
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌లో రన్ అవుతుంది. కంపెనీ దీనితో మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తోంది.
పోకో X7 ప్రో 5G ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.73 అంగుళాల 1.5k ఫ్లాట్ అమోలెడ్
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్‌సిటీ 8400 అల్ట్రా
- బ్యాటరీ: 6,550 ఎంఏహెచ్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్
- కెమెరా సెటప్: ఈ ఫోన్ వెనక వైపు 50MP సోనీ LYT-600 సెన్సర్ ఉంది. ఇందులోనూ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో కూడిన హైపర్‌ఓఎస్ 2.0తో వస్తోంది. కంపెనీ దీనితో మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని హామీ ఇస్తోంది. ఈ ఫోన్ 90W హైపర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీన్ని కేవలం 47 నిమిషాల్లోనే దీన్ని 100 శాతం ఛార్జ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.
కలర్ ఆప్షన్స్:
- నెబులా గ్రీన్
- ఒబిసిడియన్ బ్లాక్
- పోకో యెల్లో కలర్‌వేస్
వేరియంట్స్: మార్కెట్లో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
- 8GB+256GB
- 12GB+256GB
ధరలు:
- 8GB+256GB వేరియంట్ ధర: రూ.26,999
- 12GB+256GB వేరియంట్ ధర: రూ.28,999
పోకో ఈ ప్రో మోడల్ 5G స్మార్ట్‌ఫోన్ జనవరి 14 నుంచి, దీని బేస్ మోడల్ జనవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ICICI బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ.2వేలు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాక మొదటి రోజు సేల్‌లో ప్రో మోడల్‌పై రూ.1,000 డిస్కౌంట్ కూపన్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మార్కెట్లో ఒకేసారి 3 కార్లు లాంఛ్- ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!- ధర కూడా రూ.5 లక్షల లోపే!
50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో ఒప్పో రెనో 13 సిరీస్- ధర ఎంతంటే?