ETV Bharat / technology

కొత్త బైక్ కొనాలా?- అయితే ఈ అప్డేటెడ్ సుజుకి మోటార్‌సైకిళ్లపై ఓ లుక్కేయండి! - SUZUKI MOTORCYCLES 2025 UPDATE

మార్కెట్లోకి సుజుకి నుంచి ఐదు మోటార్‌సైకిళ్లు- ధర ఎంతంటే?

Gixxer 250 SF, Gixxer 150, V-Strom SX
Gixxer 250 SF, Gixxer 150, V-Strom SX (Photo Credit- Suzuki Motorcycle India)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 10, 2025, 7:48 PM IST

Suzuki India Launches Updated 2025 Motorcycle Lineup: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా నుంచి మార్కెట్లోకి ఐదు కొత్త బైక్​లు​ వచ్చాయి. కంపెనీ తన అప్డేటెడ్ మోడల్ V-స్ట్రోమ్ SX, జిక్సర్ 150, జిక్సర్ 150 SF, జిక్సర్ 250, జిక్సర్ SF 250 మోటార్​సైకిళ్ల​ను లాంఛ్ చేసింది. ప్రస్తుతం ఈ ఐదు బైక్​లను OBD-2Bతో అప్​డేట్ చేసి అదిరే కలర్ ఆప్షన్​లతో తీసుకొచ్చింది.

2025 V-స్ట్రోమ్ SX ఫీచర్లు: ఈ మోడల్ బైక్ ఛాంపియన్ ఎల్లో, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ సోనోమా రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్-షోరూమ్).

పవర్​ ట్రెయిన్: ఈ మోటార్‌సైకిల్​లో 249cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఉంది. దీన్ని OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్​డేట్ చేశారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ అప్​డేట్ తర్వాత కూడా దీని పనితీరుపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ ఇంజిన్ 9300 rpm వద్ద 26.1 bhp పవర్, 7,300 rpm వద్ద 22.2 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

2025 జిక్సర్ 250 సిరీస్ ఫీచర్లు: కంపెనీ ఈ సిరీస్​లో జిక్సర్ 250, జిక్సర్ SF 250 అనే రెండు మోడల్స్​ను తీసుకొచ్చింది. వీటిలోని జిక్సర్ 250 ధర రూ. 1.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇక రెండో మోడల్ జిక్సర్ SF 250 ధర రూ. 2.07 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కలర్ ఆప్షన్లు: సుజుకి ఈ రెండు మోటార్​సైకిల్స్​ను మూడు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది.

  • మెటాలిక్ మ్యాట్ బ్లాక్
  • మెటాలిక్ మ్యాట్ బోర్డియక్స్ రెడ్
  • మెటాలిక్ ట్రైటాన్ బ్లూ/పెర్ల్ గ్లేసియర్ వైట్

పవర్​ ట్రెయిన్: ఈ బైక్‌ల ఇంజిన్​లను కూడా OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్​డేట్ చేశారు. ఇది V-స్ట్రోమ్‌లో కనిపించే అదే 249cc ఇంజిన్‌ను కలిగి ఉంది.

2025 జిక్సర్ 150 సిరీస్ ఫీచర్లు: జిక్సర్ సిరీస్​లో జిక్సర్ 150, జిక్సర్ 150 SF చిన్న వెర్షన్లు. వీటిని అప్​డేట్ చేస్తూ కంపెనీ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

కలర్ ఆప్షన్లు:

  • మెటాలిక్ ట్రిటాన్ బ్లూ/పెర్ల్ గ్లేసియర్ వైట్
  • గ్లాస్ స్పార్కిల్ బ్లాక్
  • మెటాలిక్ ఊర్ట్ గ్రే/మెటాలిక్ లష్ గ్రీన్

150cc జిక్సర్ సిరీస్ ధర విషయానికి వస్తే ఇందులోని జిక్సర్ 150 మోడల్​ ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇక జిక్సర్ 150 SF మోడల్​ను కంపెనీ రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో లాంఛ్ చేసింది.

వీటి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే జిక్సర్ 150, జిక్సర్ 150 SF బైక్​ల​ రెండింటిలో 155cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్​ను అమర్చారు. దీన్ని కూడా OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్​డేట్ చేశారు. అయితే దీని పనితీరులో కూడా ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 13.4 bhp పవర్, 6,000 rpm వద్ద 13.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మార్కెట్లో ఒకేసారి 3 కార్లు లాంఛ్- ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!- ధర కూడా రూ.5 లక్షల లోపే!

ఐఫోన్ మీపై నిఘా పెడుతోందా?- మీ మాటలు సీక్రెట్​గా రికార్డ్ చేస్తోందా?- సిరి దుర్వినియోగంపై యాపిల్ సమాధానమిదే!

కొత్త నంబర్ల నుంచి మిస్డ్​కాల్స్ వస్తున్నాయా?- తిరిగి చేశారో ఇక అంతే!- అలాంటి సమయంలో ఏం చేయాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.