తెలంగాణ

telangana

ETV Bharat / technology

యాపిల్ లవర్స్​కు క్రేజీ అప్డేట్​- త్వరలో మార్కెట్లోకి మొట్ట మొదటి ఫోల్డబుల్ ఐఫోన్! - APPLE FIRST FOLDABLE PHONE

యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్- రిలీజ్ ఎప్పుడంటే?

Representational Image
Representational Image (Photo Credit- AP File Photo)

By ETV Bharat Tech Team

Published : Dec 31, 2024, 6:03 PM IST

Apple First Foldable Phone:యాపిల్ లవర్స్​కు క్రేజీ న్యూస్. కంపెనీ నుంచి త్వరలో మొట్ట మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ నుంచి రాబోతున్న ఫోల్డబుల్ ఫోన్లపై చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజా నివేదికలతో అన్ని ఊహాగానాలకు తెరపడే అవకాశం కన్పిస్తుంది.

మార్కెట్లో యాపిల్ ఐఫోన్ల క్రేజ్ ఏ లెవెల్​లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంపెనీ తీసుకొచ్చే కొత్త ప్రొడక్ట్స్​ కోసం టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. యాపిల్ కొత్తగా ఏం తీసుకురాబోతుంది? వాటిలో ఏయే కొత్త ఫీచర్లను అందించనుంది? అని తెలుసుకోవడంపై అంతా ఉత్సాహం ప్రదర్శిస్తారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్ల హవా నడుస్తోంది. దీంతో ఈ సెగ్మెంట్లో కొంగొత్త మోడల్స్​ను​ తీసుకొచ్చేందుకు స్మార్ట్​ఫోన్ల తయారీ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు కంపెనీల నుంచి ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేశాయి. అయితే ఇప్పుడు యాపిల్​ కూడా ఈ విభాగంలో అడుగుపెట్టి తన సత్తా చాటేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం యాపిల్‌ కొత్తగా రెండు ఫోల్డబుల్‌ డివైజ్​లపై పని చేస్తోందని సమాచారం. క్లామ్‌షెల్ స్టైల్‌ ఐఫోన్‌, బిగ్​ స్క్రీన్​ ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌తో కంపెనీ ఈ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 'శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌', 'మోటోరొలా రేజర్‌' మాదిరిగా క్లామ్‌షెల్‌ డిజైన్‌తో యాపిల్‌ ఫస్ట్‌ ఫోల్డబుల్ ఐఫోన్‌ రానుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 'ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌' కంటే దీన్ని పెద్ద స్క్రీన్‌తో తీసుకురానున్నారట. అంటే ఇది 7 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఇక ఐప్యాడ్‌ 20 అంగుళాల డిస్‌ప్లేతో రానుందని సమాచారం.

యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ఎంట్రీ ఎప్పుడు?:2026లో యాపిల్‌ ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ వచ్చే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 'ఐఫోన్‌ 18' పేరుతో దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details