2025 Honda Activa 110 Launched:మన దేశంలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. ప్రముఖ టూ-వీలర్ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇప్పుడు దీన్ని OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేసి తీసుకొచ్చింది. కంపెనీ దీనితో పాటు ఈ ఏడాది దాని మొత్తం లైనప్‌ను అప్డేట్ చేసింది.
అప్డేట్ చేసిన కొత్త హోండా యాక్టివా 110లో ఏం మార్చారు?:కంపెనీ హోండా యాక్టివా 110 ఫీచర్ జాబితాను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 4.2-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే ఉంది. ఇది మైలేజ్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఎకో-ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎమ్టీ వంటి వివిధ రకాలైన సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాక ఈ కొత్త హోండా యాక్టివా మీ డివైజ్‌లను ప్రయాణంలో కూడా ఛార్జ్ చేసేందుకు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో కూడా వస్తుంది.
హోండా యాక్టివా 110 పవర్‌ట్రెయిన్:ఈ కొత్త హోండా యాక్టివా అదే పాత 109.51cc, సింగిల్-సిలిండర్ PGM-Fi ఇంజిన్‌తో వస్తుంది. అయితే దీన్ని ఇప్పడు OBD2B-నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేశారు. ఈ ఇంజిన్ 7.7bhp పవర్, 9.03Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హోండా మోటార్‌సైకిల్ ఈ యాక్టివాలో ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌ను అమర్చింది.
ఇదిలా ఉండగా ఫస్ట్ జనరేషన్ హోండా యాక్టివా 110ను 2001 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇది గత రెండు దశాబ్దాలుగా కంపెనీ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్. ఇది పెద్దగా మారనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ దీన్ని కొత్తగా ఉంచేందుకు కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. ఇందులో LED హెడ్‌లైట్, డిజిటల్ ట్రిప్ మీటర్ వంటివి ఉన్నాయి.
2025 హోండా యాక్టివా కలర్ ఆప్షన్స్:మార్కెట్లో 2025 హోండా యాక్టివా మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో సేల్ అవుతోంది.
- మెటాలిక్ రెడ్
- పెర్ల్ బ్లాక్
- పెర్ల్ వైట్
- మెటాలిక్ బ్లూ
- మ్యాట్ గ్రే
- పెర్ల్ బ్లూ