ETV Bharat / technology

శ్రీహరికోట వేదికగా ఇస్రో 100వ మిషన్​లో సాంకేతిక లోపం- మొరాయిస్తున్న NVS-02 శాటిలైట్! - ISRO NVS 02 SATELLITE SETBACK

కక్ష్యలోకి వెళ్లేందుకు మొరాయించిన శాటిలైట్- ఇస్రో ప్రయత్నాలు విఫలం

ISRO NVS 02 Satellite Suffers Setback Thrusters Fail to Fire
ISRO NVS 02 Satellite Suffers Setback Thrusters Fail to Fire (Photo Credit- PTI)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 3, 2025, 3:26 PM IST

Updated : Feb 3, 2025, 3:32 PM IST

ISRO NVS 02 Satellite Setback: శ్రీహరికోట వేదికగా ఇస్రో గత నెలలో 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అయితే మిషన్​లో సాంకేతిక లోపం తలెత్తడంతో NVS​-02 శాటిలైట్​ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. శాటిలైట్​లోని థ్రస్టర్లు (ఇంజిన్లు) ప్రజ్వరిల్లకపపోవడమే ఇందుకు కారణమని ఇస్రో ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్ వేదికగా వెల్లడించింది.

భారత ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌ వ్యవస్థలో ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్ చాలా కీలకం. ఇది దేశ నావిగేషనల్ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ శాటిలైట్ భూమి, వైమానిక, సముద్ర.. నావిగేషన్, మొబైల్ డివైజెస్​లో లొకేషన్-బేస్డ్ సర్వీసులు, ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ (IoT) బేస్డ్ అప్లికేషన్స్, ఎమర్జెన్సీ అండ్ టైమ్ సర్వీసులను అందించేందుకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో 2,250 కిలోల ఈ NVS-02 ఉపగ్రహాన్ని పదేళ్లపాటు సేవలు అందించేలా ఇస్రో రూపొందించింది. ఇది L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్​ను కలిగి ఉంది. అంతేకాక ఇది NVS-01 మాదిరిగా అదనపు C-బ్యాండ్​లో కూడా పేలోడ్‌ను కలిగి ఉంది.

ఈ కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV-F15 రాకెట్‌ ద్వారా గత నెల 29న నింగిలోకి ప్రయోగించారు. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) తన 17వ ప్రయోగంలో స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ NVS-2 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఈ క్రమంలో అనుకున్నట్లుగా దీన్ని నిర్దేశిత కక్ష్యలో చేర్చే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం చేపట్టారు. ఇందుకోసం ఉపగ్రహం ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి వాటిని మండించేందుకు ప్రయత్నించారు. కానీ ఇంజిన్లలోకి పంపే వాల్వ్‌లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు ప్రజ్వరిల్లకపోవడంతో ఇస్రో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ శాటిలైట్ జియోసింక్రోనస్ ట్రాన్సఫర్ ఆర్బిట్ (భూఅనువర్తిత బదిలీ కక్ష్య- జీటీవో)లో పరిభ్రమిస్తోంది. నేవిగేషన్‌ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు ఈ కక్ష్య అనువైనది కాదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇస్రో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శాటిలైట్ పనితీరులో ఎటువంటి లోపం లేదని, దాని వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది.

బాల్యం నుంచే స్మార్ట్​ఫోన్- యవ్వనంలో మతి చెడిపోతుందట!

ఈవీ రంగంపై కేంద్రం వరాల జల్లు- ఇకపై తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్లు, బైక్​లు, ఫోన్​ల ధరలు!

ఎడ్యుకేషన్​లోనూ ఏఐ- రూ.500కోట్లు కేటాయించిన కేంద్రం

Last Updated : Feb 3, 2025, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.