ETV Bharat / business

కారు మైలేజీ పెరగాలా? ఈ సింపుల్ టిప్స్​ పాటిస్తే అంతా సెట్! - MILEAGE HACKS TIPS FOR CARS

కారు మైలేజీ పెరగాలా ? ఈ టిప్స్ ఫాలో అయిపోండి!

Mileage Hacks Tips For Cars
Mileage Hacks Tips For Cars (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2025, 5:08 PM IST

Mileage Hacks Tips For Cars : కారు మైలేజీ పెరగాలంటే దాన్ని సరిగ్గా, సమర్థంగా నిర్వహించాలి. అందుకోసం ఏమేం చేయాలనే దానిపై వాహనదారుడు ఒక స్పష్టమైన అవగాహనకు రావాలి. రెగ్యులర్‌గా ఆయిల్‌ను మార్చుకొని ఇంజిన్‌ను కండీషన్‌లో ఉంచుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయించుకోవాలి. వీటితో పాటు ఇంకొన్ని టిప్స్‌ను ఆచరణలో పెడితే తప్పకుండా కారుకు మంచి మైలేజీ లభిస్తుంది. ఇంతకీ అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

కారు మైలేేజీ పెంచుకునే టిప్స్ ఇవీ

క్రూయిజ్ కంట్రోల్ : కారులో క్రూయిజ్ కంట్రోల్ మోడ్ ఉంటుంది. కారు వేగం నిలకడగా ఉండటానికి దీన్ని వినియోగించాలి. ప్రత్యేకించి హైవేలపై జర్నీ చేసేటప్పుడు ఇది పనికొస్తుంది. కారు ఈ మోడ్‌లో ఉన్నప్పుడు యాక్సిలరేటర్ పెడల్‌పై నుంచి పాదాన్ని తీసి, డ్రైవర్ కారును నడపొచ్చు. ఈ మోడ్‌‌లో డ్రైవింగ్ చేసే క్రమంలో ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది.

అతిగా ఇడ్లింగ్ వద్దు : కారు రెస్టింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇంజిన్‌ను ఆన్ చేసి ఉంచకూడదు. పార్కింగ్ కోసం, లేదా చేశాక కారు ఇంజిన్‌ను ఆఫ్ చేసి ఉంచితే ఇంధన వినియోగం తగ్గిపోతుంది. ఒకవేళ ఇలాంటప్పుడు ఇంజిన్‌ను ఆన్ చేసి వదిలేస్తే, ఇంజిన్‌ను రీస్టార్ట్ చేసేటప్పుడు వినియోగమయ్యే ఇంధనం కంటే ఎక్కువే ఖర్చవుతుంది. ఫలితంగా మైలేజీ తగ్గుతుంది.

అనవసర బరువు వద్దు : కారులో ఉన్న అనవసర వస్తువులు, పరికరాలను తీసేయండి. దీనివల్ల వాహనం బరువు తగ్గుతుంది. ఫలితంగా మైలేజీ, వేగం పెరుగుతాయి.

రెగ్యులర్‌ మెయింటెనెన్స్ : కారులోని ఇంజిన్ ఆయిల్‌ను రెగ్యులర్‌గా మార్చాలి. ఎయిర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయించుకోవాలి.

టైర్ల నిర్వహణ : కారు టైర్లలో తగినంత గాలి ఉండేలా జాగ్రత్త వహించండి. దీనివల్ల కారు రోడ్డుపై సాఫీగా నడుస్తుంది. తత్ఫలితంగా మెరుగైన మైలేజీ వస్తుంది.

డ్రైవింగ్‌లో సున్నితత్వం : కారును ర్యాష్‌గా డ్రైవ్ చేయకండి. అకస్మాత్తుగా వేగాన్ని పెంచడం వంటివి చేయొద్దు. రోడ్డుపై జర్నీ చేసేటప్పుడు కారు వేగం నిలకడగా ఉండేలా జాగ్రత్తపడండి. రోడ్డుపై ఏవైనా అవాంతరాలు దూరం నుంచే గుర్తించి, వాహన వేగాన్ని తగ్గించుకోండి. దీనివల్ల సడెన్ బ్రేకులు వేయాల్సిన పరిస్థితి రాదు. ఇవన్నీ ఫాలో అయితే కారు మైలేజీ తప్పక పెరుగుతుంది.

మీ ఫ్యామిలీ కోసం మంచి కార్​ కొనాలా? ఈ టాప్​-10 సేఫ్టీ ఫీచర్స్ మస్ట్​!

మంచి మైలేజ్ ఇచ్చే SUV కార్‌ కొనాలా? టాప్‌-10 ఆప్షన్స్‌ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.