SA20 Final : సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహిస్తోన్న ఎస్‌ఏ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్స్ ఓటమిపాలైంది. అయితే, ఈ గేమ్‌లో అన్నింటికంటే హైలైట్ విషయం మరొకటి ఉంది. అదే ఆ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ బెడింగ్‌హామ్ తన వివాహాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నాడు. శనివారమే అతడి పెళ్లి. సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరుకోవడంతో తన పెళ్లిని ఆదివారానికి వాయిదా వేసుకున్నట్లు తెలిపాడు.
"జెన్నా వాన్ నీకెర్క్‌తో బెడింగ్‌హామ్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. వేడుకకు ఏర్పాట్లన్నీ జరిగాయి. సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరుకోవడం వల్ల తను ఆగిపోయాడు. అందుకే వారి వివాహం ఆదివారం జరగనుంది" అంటూ సౌతాఫ్రికా క్రికెట్ రిపోర్టర్ ఫిర్దోస్ తాజాగా ఓ ఈవెంట్లో పేర్కొన్నాడు.
"నా ఫియాన్సీ జెన్నా మాత్రం మేము ఓడిపోతామని అంచనా వేసింది. ఫైనల్‌కు చేరుకోవాలని ఆమె కూడా కోరుకుంది. అలాగే వివాహం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పింది. క్వాలిఫయర్ మ్యాచ్ టైమ్‌లోనే మా బ్యాచలర్ పార్టీ జరిగింది. దానికి మా నాన్న, సోదరుడు వచ్చారు" అని బెడింగ్‌హామ్ వెల్లడించాడు.
తక్కువ స్కోరుకే ఓటమి
అయితే ఎస్‌ఏ20 ఫైనల్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 181 పరుగులను నమోదు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో హ్యాట్రిక్ కప్ కొట్టాలనుకున్న సన్‌రైజర్స్‌కు నిరాశే మిగిలింది. డేవిడ్ బెడింగ్‌హామ్ కేవలం 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. కగిసో రబాడ బౌలింగ్‌లో డేవిడ్ ఔటయ్యాడు.
We hope David Bedingham’s dad survived the bachelor party 😂
— SuperSport 🏆 (@SuperSportTV) February 8, 2025
Also, the rush for the airport for Bedders is going to be 🔥😭#BetwaySA20 pic.twitter.com/KtaEuEukMH
హ్యాట్రిక్ మిస్
కాగా, సన్‌రైజర్స్ జట్టు 2023, 2024 సీజన్లలో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ మూడో టైటిల్ పట్టేయాలని పోరాడింది. కానీ, ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో ముంబయి విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పటివరకు 3 సీజన్లు జరగ్గా, రెండుసార్లు సన్‌రైజర్స్, ఒకసారి ముంబయి ఛాంపియన్లుగా నిలిచాయి.
ఫైనల్‌లో SRHకు షాక్- మళ్లీ రన్నరప్‌గానే- పాపం కావ్య ఫీలైందిగా!
'నా ఫోన్ ఎక్కడో పోయింది' - నెట్టింట వాపోయిన పాకిస్థాన్ క్రికెటర్