Best Smartphone in Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంతో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు సెప్టెంబర్ నెల సరైన సమయం కానుంది. తన అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌లలో ఒకటైన ఈ సేల్స్‌లో భాగంగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. దీంతో కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి తరుణం కానుంది. ఈ సందర్భంగా రూ. 40,000 లోపు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకుందాం రండి.
Motorola Edge 50 Fusion:
- ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని నెలల క్రితమే లాంచ్ అయింది.
- ఇది ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మిడ్ రేంజ్ మొబైల్.
- రిఫ్రెష్ రేట్: 144Hz
- డిస్ప్లే: 6.7 అంగుళాల pOLED స్క్రీన్
- ప్రాసెసర్:స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్
- కెమెరా:ఈ మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
- ప్రైమరీ కెమెరా: 50MP
- అల్ట్రావైడ్ లెన్స్: 13MP
- ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది.
- 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్ను కలిగి ఉంది.
- ధర: రూ. 20,000 లోపు
- క్లీన్ సాఫ్ట్‌వేర్‌తో ప్రీమియం-లుకింగ్ ఫోన్ కావాలనుకునే వారికి ఎడ్జ్ 50 ఫ్యూజన్ మంచి ఎంపిక.
POCO F6:
- POCO F6 ఈ ఏడాది మార్కెట్లో విడుదలైంది.
- మిడ్- రేంజ్ శ్రేణి ఫోన్‌లలో ఇది ఒకటి.
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్
- సాలిడ్ ప్లాస్టిక్ బిల్డ్
- ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ ఓఎస్‌తో పనిచేస్తుంది.
- ఇది క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించగల లైట్‌వెయిట్ మొబైల్.
- రూ. 25,000 లోపు ధరలో ఓ మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి Poco F6 ఉత్తమ ఎంపిక.
- బ్యాంక్ ఆఫర్లతో ఇది రూ.21,999 కంటే తక్కువ ధరకే లభిస్తుంది.