Minister Komati Reddy Venkatareddy On Hyderabad Vijayawada National Highway Expansion : మే మొదటి వారంలో 6 వరుసలుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్లు గుర్తించామని, బ్లాక్ స్పాట్ల వద్ద పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలి : రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి చౌరస్తాలోని దాబాలో డ్రైవర్లకు కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించి, వారికి ఉచితంగా కళ్ల జోళ్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సీట్ బెల్ట్ ధరించాలని, కళ్ల సమస్యలు ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
'లారీ డ్రైవర్లు ఓవర్ డ్యూటీ చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని డ్రైవింగ్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఒకేసారి ముగ్గురు వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్నారు. ఇలా ఎక్కువగా ప్రమాదాలు జరిగి చాలా మంది మృతి చెందారు. ట్రిపుల్ డ్రైవింగ్, మందు తాగా బండి నడపడం లాంటివి చేయకుండా ఉంటే 70 శాతం ప్రమాదాలను తగ్గించవచ్చు.'- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ - ఈ రూట్‌లలో నాలుగు, ఆరు లైన్లకు గ్రీన్ సిగ్నల్
7 జాతీయ రహదారుల పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ - బండి ఇక ఆగేదే లే!