Apple May Launch MacBook Air with M4 Chip:గత వారమే తన చౌకైన 'ఐఫోన్ 16e'ను రిలీజ్ చేసిన యాపిల్ తాజాగా మరో లాంఛ్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన 13-అంగుళాల, 15-అంగుళాల 'మ్యాక్‌బుక్ ఎయిర్'ను కొత్త M4 చిప్‌తో అప్డేట్ చేయనుంది. ఈ మేరకు యాపిల్ 'మ్యాక్‌బుక్ ఎయిర్' లైనప్‌ను వచ్చే నెలలో కొత్త M4 చిప్‌లతో రిఫ్రెష్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంటే కంపెనీ మొత్తం మ్యాక్‌బుక్ ఫ్యామిలీని ఈ లెటెస్ట్ ప్రాసెసర్ జనరేషన్‌లోకి తీసుకురాబోతుందన్నమాట.
బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ తన 'పవర్ ఆన్ న్యూస్‌లెటర్' (Power On newsletter)లో యాపిల్ తన అప్‌కమింగ్ లాంఛ్ కోసం రిటైల్, మార్కెటింగ్ అండ్ సేల్స్ టీమ్స్‌ను సిద్ధం చేయడం ప్రారంభించిందని రాసుకొచ్చారు. ఇందుకోసం కంపెనీ ప్రస్తుతం 'మ్యాక్‌బుక్ ఎయిర్' ఇన్వెంటరీ లెవల్స్‌ను తగ్గించడానికి కూడా అనుమతిస్తోందని తెలిపారు. ఇన్వెంటరీ లెవల్స్ అంటే ఒక వ్యాపారం తన పంపిణీ నెట్‌వర్క్‌లో ఉంచుకున్న స్టాక్ మొత్తం అని అర్థం. కంపెనీ ఇప్పుడు తన ప్రస్తుత 'మ్యాక్‌బుక్ ఎయిర్' ఇన్వెంటరీ లెవల్స్‌ను తగ్గించడం అనేది తన ఇమ్మినెంట్ ప్రొడక్ట్ అప్డేట్కు ఒక సాధారణ సంకేతం.
అయితే ఈ లాంఛ్ డేట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. కానీ ఈ నివేదిక నిజమైతే మార్చికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉన్నందున దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త మ్యాక్‌బుక్‌ల షిప్‌మెంట్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని గతవారం నుంచే కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే వీటి లాంఛ్ ఇంకా త్వరగానే ఉండొచ్చని కూడా ఈ నివేదికలు సూచిస్తున్నాయి.
మ్యాక్‌బుక్ ఎయిర్ కొత్త అప్‌గ్రేడ్స్ ఇవే!:ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ కనీస అప్‌గ్రేడ్‌లతో వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త యాపిల్ ల్యాప్‌టాప్ M4 చిప్‌తో బేస్ వేరియంట్‌లో 16GB RAMతో వస్తుంది. USB 4 లేదా Thunderbolt 3కి బదులుగా Thunderbolt 4 పోర్ట్ అదనపు సపోర్ట్‌తో సహా డివైజ్ పొటెన్షియల్ ఇంప్రూవ్మెంట్స్పై కూడా నివేదికలు ఉన్నాయి. అంతేకాక సెంటర్ స్టేజ్ కెమెరా ఫీచర్ కూడా ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌లో వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆప్షనల్ నానో-టెక్చర్ డిస్ప్లే కూడా ఇందులో ఉండొచ్చు. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఇతర M4-బేస్డ్ మ్యాక్‌లలో తీసుకొచ్చారు.