తెలంగాణ

telangana

ETV Bharat / technology

యాపిల్ ఇంటెలిజెన్స్​తో మినీ ఐప్యాడ్ లాంచ్- స్టూడెంట్స్​కు స్పెషల్ ఆఫర్..!

యూజర్​ ఫ్రెండ్లీ మినీ ఐప్యాడ్ తీసుకొచ్చిన యాపిల్- ధర, ఫీచర్లు ఇవే..!

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

Apple ipad Mini with Apple Intelligence
Apple ipad Mini with Apple Intelligence (Apple)

Apple ipad Mini with Apple Intelligence:టెక్​ దిగ్గజం యాపిల్ మార్కెట్లోకి ఓ సరికొత్త మినీ ఐప్యాడ్​ను తీసుకొచ్చింది. ఇది A17 ప్రో చిప్, యాపిల్ ఇంటెలిజెన్స్​తో నడుస్తుంది. అద్భుతమైన ఫీచర్లతో పాటు అల్ట్రాపోర్టబుల్ డిజైన్‌తో ఈ కొత్త మినీ ఐప్యాడ్​ను తీసుకొచ్చింది. ఇది దీని ప్రీవియస్ వెర్షన్​ ఐప్యాడ్​ మినీ కంటే 2x వేగవంతమైన న్యూరల్ ఇంజిన్‌తో పాటు Apple పెన్సిల్ ప్రోకి సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఐప్యాడ్ మినీ న్యూ బ్లూ, పర్పుల్​తో సహా నాలుగు ఫినిషింగ్​లో మార్కెట్లో అందుబాటులో ఉంది. మార్కెట్లో దీని ప్రీ- ఆర్డర్ సేల్స్​ ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 23 నుంచి ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ మినీ ఐప్యాడ్​ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.

ఫీచర్స్:

  • డిస్​ప్లే:8.3-అంగుళాల లిక్విడ్ రెటినా
  • Apple పెన్సిల్ ప్రో సపోర్ట్
  • ఫాస్టర్ CPU అండ్ GPU
  • బ్యాక్ కెమెరా: 12MP

దీని ధర:

  • యాపిల్ మినీ ఐప్యాడ్ Wi-Fi మోడల్ ధర:రూ. 49,990 నుంచి ప్రారంభం
  • Wi-Fi + సెల్యులార్ మోడల్‌ ధర: రూ. 64,900 నుంచి ప్రారంభం

స్టూడెంట్స్​కు స్పెషల్ ఆఫర్:ఈ కొత్త ఐప్యాడ్ మినీ దాని పాత వెర్షన్​ కంటే రెట్టింపు స్టోరేజీని కలిగి ఉంది. ఇది 128GB స్టోరేజీతో ప్రారంభమవుతుంది. కొత్త ఐప్యాడ్ మినీ 256GB, 512GB కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్​తో రావడంతో మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఎడ్యుకేషన్ కోసం ఐప్యాడ్ మినీ ప్రారంభ ధర రూ. 44,900 అని కంపెనీ తెలిపింది. అంటే ఇది స్టూడెంట్స్, అధ్యాపకులు, సిబ్బంది, హోమ్- స్కూల్ టీచర్స్​కు స్పెషల్ ఆఫర్​లో ఇది అందుబాటులో ఉంది.

"కొత్త ఐప్యాడ్​ మినీ వైడ్​ రేంజ్ యూజర్స్​ను ఆకర్షిస్తుంది. ఇది యాపిల్​ ఇంటెలిజెన్స్​తో వస్తుంది. పవర్​ఫుల్​, పర్సనల్ అండ్ ప్రైవేట్​గా ఉండే ఇంటెలిజెంట్ ఫీచర్లతో ఈ మినీ ఐప్యాడ్ వస్తుంది." - బాబ్ బోర్చర్స్, యాపిల్ వరల్డ్‌వైడ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల ఫస్ట్ సెట్ ఈ నెలలో యూఎస్ ఇంగ్లీషులో iPadOS 18.1తో ఫ్రీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్​తో అందుబాటులో ఉంటుంది. A17 ప్రో లేదా M1 తర్వాత ఐప్యాడ్‌కు అందుబాటులో ఉంటుంది.

ల్యాప్​టాప్ ఇంపోర్ట్స్​పై ఆంక్షలు..! - ఎప్పటినుంచంటే?

దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లాంచ్- ధర ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details