Airtel to Bring Apple Video Music Content: టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు మెరుగైన కంటెంట్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. కస్టమర్లకు యాపిల్ టీవీ+, యాపిల్ మ్యూజిక్ కంటెంట్‌ను యాక్సెస్ చేసే ఫెసిలిటీ తీసుకురానుంది. ఇందుకోసం ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
దీనివల్ల ఎవరికి ఎంత లాభం?:
- ఎయిర్‌టెల్ కస్టమర్లు అచ్చం ఎక్స్‌ట్రీమ్ తరహాలోనే వింక్(Wynk) మ్యూజిక్‌లో యాపిల్ మ్యూజిక్ కంటెంట్‌ను పొందొచ్చు. ఈ ఫెసిలిటీ ఎయిర్‌టెల్ కస్టమర్లందరికి అందుబాటులోకి రానుంది.
- ఎక్స్‌ట్రీమ్ యాప్‌లో యాపిల్ టీవీ+ కంటెంట్, కామెడీ సిరీస్, డాక్యుమెంటరీలు, హాలీవుడ్, కిడ్స్ షో, అవార్డ్ విన్నింగ్ సినిమాలు వీక్షించొచ్చు. ఈ సర్వీసులు ప్రీమియం వైఫై, పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
- యాపిల్ మ్యూజిక్ యాప్ ఫీచర్లో యాపిల్ మ్యూజిక్ సింగ్, టైమ్-సింక్డ్ లిరిక్స్, లాస్‌లెస్ ఆడియో, స్పేషియల్ ఆడియో కంటెంట్లు ఉంటాయి. యాపిల్ మ్యూజిక్ కంటెంట్ కోసం Wynk ప్రీమియం యూజర్స్‌కు అదిరిపోయే ఆఫర్లు అందిస్తామని ఎయిర్‌టెల్ ప్రకటించింది.
ఎయిర్‌టెల్ యూజర్లకు మెరుగైన కంటెంట్: టెక్ దిగ్గజం యాపిల్‌తో భాగస్వామ్యం పట్ల ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమృత్ త్రిపాఠి ఆనందం వ్యక్తం చేశారు. తమ యూజర్లకు మెరుగైన కంటెంట్ అందించేందుకు యాపిల్ భాగస్వామ్యం ఎంతో సాయపడుతుందన్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు అమృత్ త్రిపాఠి వెల్లడించారు.