ETV Bharat / technology

అత్యాధునిక ఫీచర్లతో 2025 హోండా యూనికార్న్- ధర కూడా పెరిగిందిగా!- ఇప్పుడెంతంటే? - 2025 HONDA UNICORN LAUNCHED

అప్డేటెడ్ డిజిటల్ LCD క్లస్టర్​తో హోండా నయా యూనికార్న్- ధర, ఫీచర్లు ఇవే..!

2025 Honda Unicorn
2025 Honda Unicorn (Photo Credit- Honda Motorcycle India)
author img

By ETV Bharat Tech Team

Published : 16 hours ago

Updated : 16 hours ago

2025 Honda Unicorn Launched: హోండా యూనికార్న్ అభిమానులకు గుడ్​న్యూస్. దేశీయ మార్కెట్లోకి 2025 మోడల్ హోండా యూనికార్న్ ఎంట్రీ ఇచ్చింది. హోండా టూ-వీలర్స్​లో యూనికార్న్​ మోడల్​ది ప్రత్యేక స్థానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చిన మోటార్​సైకిల్స్​లో ఇది భారీ సేల్స్​ను సొంతం చేసుకుని అత్యంత విజయవంతమైంది.

ఇదిలా ఉండగా మరికొద్ది రోజుల్లో 2024 ముగుస్తుండగా.. గత కొన్ని నెలల నుంచి కంపెనీ తన పాత మోడల్స్​ను అప్​డేట్స్ చేస్తూ నయా మోడల్స్​ను వరుస పెట్టి లాంఛ్ చేస్తోంది. కంపెనీ ఇటీవలే తన అప్డేటెడ్ 'యాక్టివా 125', 'SP 125', 'SP160' బైక్​లను లాంఛ్ చేసింది. తాజాగా తన '2025 హోండా యూనికార్న్' మోటార్​సైకిల్​ను విడుదల చేసింది.

హోండా మోటార్​సైకిల్ ఇండియా OBD2B ప్రమాణాలకు అనుగుణంగా దాని ఉత్పత్తులను అప్డేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ కొత్త యునికార్న్​ను కూడా అదే అప్​గ్రేడ్స్​తో తీసుకొచ్చింది. దీనితో పాటు ఈ కొత్త బైక్​లో చాలా అప్డేట్స్, ఫీచర్లను అందించింది. అయితే అప్డేట్లకు తగినట్లుగానే ఈ నయా యూనికార్న్ ధర కూడా మునుపటి కంటే ఎక్కువగానే ఉంది. కంపెనీ '2025 హోండా యూనికార్న్‌' బైక్​ను రూ. 1.19 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఇది ప్రస్తుత మోడల్ కంటే రూ.8,000 ఎక్కువ ఖరీదైనది.

ఈ కొత్త మోడల్​ బైక్​లో ఆల్-LED హెడ్​లైట్స్​ను అమర్చారు. అయితే ఈ హైడ్​లైట్​ యూనిట్ డిజైన్, లేఅవుట్​ పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్​ అప్డేటెడ్ డిజిటల్ LCD క్లస్టర్​తో వస్తోంది. ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, 'ఎకో' ఇండికేటర్‌ వంటి ఫీచర్లను జోడించింది. వీటితోపాటు కంపెనీ ఇప్పుడు ఈ కొత్త మోటార్​సైకిల్​లో 15-వాట్ల USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించింది.

కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ కొత్త 2025 హోండా యూనికార్న్ బైక్​ను మూడు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది.

  • పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్
  • మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్
  • రేడియంట్ రెడ్ మెటాలిక్

ఇంజిన్: 2025 హోండా యూనికార్న్ ఇప్పటికే ఉన్న 162.71cc, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌తో వస్తుంది. అయితే ఇది మునిపటి కంటే కొంచెం ఎక్కువ పవర్​ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 13.1bhp పవర్, 14.58 Nm టార్క్​ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్​ మునుపటిలాగానే 5-స్పీడ్ గేర్‌బాక్స్​తో వస్తుంది.

వాట్సాప్​లో మీకు బ్లూ కలర్ సర్కిల్ కన్పిస్తుందా?- దీని ఉపయోగాలు తెలిస్తే షాకే!- ఎలా వాడాలంటే?

పవర్​ఫుల్ ఫీచర్లతో రెడ్​మీ నుంచి 5G స్మార్ట్​ఫోన్- టీజర్ చూశారా?

అద్భుతమైన ఫీచర్లతో 'షావోమీ ప్యాడ్ 7'- ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

50MP కెమెరా, 5500mAh బ్యాటరీ.. వివో కొత్త 5G ఫోన్ ఏముంది భయ్యా.. రూ. 12,999లకే!

Last Updated : 16 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.