Horoscope Today December 29th, 2024 : డిసెంబర్ 29వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న పనులు నెరవేరుతాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రోజంతా ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. బంధువులతో అకారణ వైరాలు, ఆర్థిక సమస్యలతో విసుగుచెందుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. సూర్యాష్టకం పఠించడం శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తి ఈ రోజు ఎదురుపడే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి పరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు సహద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి పని ఒత్తిడి తప్పదు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ప్రయాణాలు అనుకూలం కాదు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అద్భుతమైన పనితీరుతో పదోన్నతులు పొందుతారు. వ్యాపారులు నూతన వెంచర్లు, ప్రాజెక్టులు మొదలు పెడితే అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. గాసిప్స్‌కు దూరంగా ఉంటే మంచిది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండండి. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన శుభకరం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు వస్తాయి. అయోమయం, ప్రతికూల ఆలోచనలతో అశాంతి నెలకొంటుంది. వృత్తి పరంగా ఊహించని ఒత్తిళ్లు ఉంటాయి. ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు అందుకుంటారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి పరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులు, ప్రియమైనవారితో విహారయాత్రకు వెళ్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. శత్రుభయం ఉండవచ్చు. మీ కోపం కారణంగా మంచి అవకాశాలు చేజారిపోతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. సింధూర గణపతిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్వయంకృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి పరంగా జరిగే చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వీలైనంత వరకు కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. సమావేశాలు, చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, ఆర్థికంగా ఈ రోజు చాలా లాభాలు పొందుతారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. మీ ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ప్రదేశంలో ఎవరితోనూ ఘర్షణలు వద్దు. అలసట, బద్ధకం కారణంగా పని పట్ల శ్రద్ధ లోపిస్తుంది. వృత్తి పరంగా ఈ రోజంతా ప్రతికూలంగా ఉండే అవకాశముంది. కాబట్టి కొత్త పనులేవీ మొదలు పెట్టవద్దు. శత్రు భయం ఉంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. సంకట మోచన హనుమాన్ ఆలయ సందర్శన ప్రతికూలతలు తొలగిస్తుంది.