ETV Bharat / technology

వాట్సాప్​లో మీకు బ్లూ కలర్ సర్కిల్ కన్పిస్తుందా?- దీని ఉపయోగాలు తెలిస్తే షాకే!- ఎలా వాడాలంటే? - META AI ON WHATSAPP

వాట్సాప్​లో 'Meta AI'- ఎవరికి ఉపయోగం? ఎలా వాడాలి?

Meta AI
Meta AI (Photo Credit- Meta)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 27, 2024, 1:37 PM IST

Meta AI on Whatsapp: ఫేస్​బుక్ మాతృసంస్థ మెటా.. వాట్సాప్​లోని తన 'Meta AI' చాట్​బాట్​ సేవలతో యూజర్ ఇంటరాక్షన్స్​ను మరింత మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న తరుణంలో కంపెనీ ఇటీవలే ఈ చాట్​బాట్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ కాన్వర్జేషన్స్​ను స్మార్ట్​గా, మరింత సమర్థవంతగా చేసేందుకు ఈ ఫీచర్​ను ఇండియాతో పాటు క్రమంగా ఇతర దేశాల్లో కూడా పరిచయం చేస్తోంది.

వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు, టెక్స్ట్ కంటెంట్​ను ప్రిపేర్ చేసేందుకు, టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుంచి ఇమేజ్​లను క్రియేట్ చేయడం, సమ్మరీస్ అండ్ ట్రాన్స్​లేషన్స్​తో పాటు ఇతర టాస్క్​లలో సహాయం చేసేందుకు దీన్ని ఉపయోగించొచ్చు. మెటా.. దీన్ని ఇండియా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, సింగపూర్​తో సహా 12 దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ దీన్ని భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని యోచిస్తోంది.

ఈ 'Meta AI'ను వాట్సాప్​, ఫేస్​బుక్​, మెసెంజర్, ఇన్​స్టాగ్రామ్ సహా meta.ai పోర్టల్​లో వినియోగించుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో వినియోగదారులు ఉచితంగానే ఏఐ ఫొటోలను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మెటా అభివృద్ధి చేసిన ఈ ఏఐ.. లామా 3.2 లాంగ్వెజ్ మోడల్​ ఆధారంగా పనిచేస్తుంది.

ప్రస్తుతం ఈ టూల్​ ఇంగ్లిష్​ భాషకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. త్వరలో దీన్ని తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇది వాట్సాప్‌లో నేరుగా ఇంటిగ్రేట్ చేయడంతో పాటు ప్రొడక్టవిటీ, క్రియేటివిటీని పెంపొందించడంలో సహాయపడుతుంది. దానికి పంపించిన మెసెజ్​లను మాత్రమే ప్రాసెస్ చేయడం ద్వారా ఇది వినియోగదారుల గోప్యతను కాపాడుతుంది. ఈ సందర్భంగా వాట్సాప్​ వ్యక్తిగత చాట్‌లో 'Meta AI'తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

'Meta AI'ని ఎలా ఉపయోగించాలి?:

  • మొదట మీ ఆండ్రాయిడ్ లేదా iOS డివైజ్​లో వాట్సాప్​ను ఓపెన్ చేయండి.
  • 'Meta AI' ఐకాన్: ఆండ్రాయిడ్ యూజర్లకు అయితే వాట్సాప్​లో 'Meta AI' ఐకాన్.. మెయిన్ స్క్రీన్​పై 'New Chat'కి ఎగువన కన్పిస్తుంది. ఇక iOS వినియోగదారులకు ఈ చిహ్నం ఇన్​బాక్స్​లో స్క్రీన్ పైభాగంలో కన్పిస్తుంది.
  • ఓపెన్ చాట్ విండో: ఇప్పుడు ప్రత్యేక చాట్ విండోను ఓపెన్ చేసేందుకు 'Meta AI' ఐకాన్​పై క్లిక్ చేయండి. ఈ చాట్ విండోలో మీరు AIతో చాటింగ్ ప్రారంభించొచ్చు.
  • అయితే ఈ టూల్ ప్రస్తుతం ఇంగ్లిషు భాషకు మాత్రమే పరిమితమై ఉంది. కాబట్టి వినియోగదారులు 'Meta AI' ను ఏదైనా ప్రశ్న అడగాలి అనుకుంటే ఇంగ్లిషులోనే టైప్ చేయాల్సి ఉంటుంది. 'Meta AI' మీరు ఎలాంటి వెరైటీ ప్రశ్న అడిగినా స్పందించి సమాధానాలను అందిస్తుంది.
  • ఇది మీ డిస్క్రిప్షన్ ఆధారంగా క్షణాల్లోనే ఇమేజ్​ను జనరేట్ చేయగదలదు. ఈ ఫీచర్​ ముఖ్యంగా విజువలైజింగ్ క్రియేటివ్ ఐడియాస్ లేదా యునిక్ గ్రాఫిక్స్​ను క్రియేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

పవర్​ఫుల్ ఫీచర్లతో రెడ్​మీ నుంచి 5G స్మార్ట్​ఫోన్- టీజర్ చూశారా?

స్టైలిష్ లుక్, టాప్ స్పెసిఫికేషన్స్.. కవాసకి కొత్త డ్యూయల్ స్పోర్ట్ బైక్ లాంఛ్- ఇది చాలా కాస్ట్లీ గురూ!

అద్భుతమైన ఫీచర్లతో 'షావోమీ ప్యాడ్ 7'- ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

'వన్‌ప్లస్ 12' స్మార్ట్​ఫోన్​పై భారీ డిస్కౌంట్- ఏకంగా రూ.7,000 వరకు తగ్గింపు!- ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.