Whatsapp Security Tips : ప్రస్తుత కాలంలో వాట్సాప్ వాడని వారంటూ లేరంటే అది అతిశయోక్తి కాదు. చాలా సులువుగా పర్సనల్ చాట్లు చేయడానికి, ఇతరులతో కమ్యునికేట్ కావడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం. అయితే సైబర్ దాడులు పెరుగుతున్న నేటి కాలంలో, మీ వాట్సాప్ అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో మీ వాట్సాప్ ఖాతాను సురక్షితంగా ఉంచుకునేందుకు అవసరమైన 7 టిప్స్ ఏంటో చూద్దాం.
1. టూ-స్టెప్ వెరిఫికేషన్ మస్ట్!
మీ వాట్సాప్ అకౌంట్‌కు కచ్చితంగా 'రెండు అంచెల ధ్రువీకరణ' (టూ-స్టెప్ వెరిఫికేషన్)ను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే దానికి పటిష్ఠమైన 6 అంకెల పిన్ను పెట్టుకోవాలి. ఆ పిన్ ఎవరూ ఊహించలేని విధంగా, చాలా పటిష్ఠంగా ఉండేలా చూసుకోవాలి. మీరు ఏదైనా కొత్త డివైజ్‌లో, లేదా వేరేవాళ్ల డివైజ్‌లో వాట్సాప్ ఉపయోగించినప్పుడు, ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ కోడ్ వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది.
- వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
- ఆ తర్వాత టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎంచుకోవాలి
- ఎనేబుల్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి
- ఆపై ఆరు అంకెల్ పిన్ సెట్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి
- అలాగే అందులో మీరు కావాలంటే ఈ-మెయిల్ ఇవ్వొచ్చు.
2. వాట్సాప్ వెబ్‌తో జాగ్రత్త!
మీ వాట్సాప్ ఖాతా ఏఏ డివైజ్‌లలో యాక్టివ్‌గా ఉందో ట్రాక్ చేయడం చాలా అవసరం. వాస్తవానికి వాట్సాప్‌లోనే మీరు ఏఏ డివైజ్‌లలో లాగిన్ అయి ఉన్నారో, ఆ జాబితా కనిపిస్తుంది. ఒకవేళ ఆ జాబితాలో మీకు తెలియని డివైజ్‌లు ఉన్నా, లేదా అనధికారికంగా ఎవరైనా మీ వాట్సాప్‌ను వాడుతున్నట్లు గమనించినా, వెంటనే దాని నుంచి లాగౌట్ అవ్వాలి. ముఖ్యంగా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వాడుతున్నవారు ఈ టిప్ పాటించి, తమ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
- ఫోన్లో వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి
- సెట్టింగ్స్‌లోకి వెళ్లి, లింక్డ్ డివైజ్‌లోకి వెళ్లాలి
- అందులో మీకు తెలియని డివైజ్‌లు ఉన్నా లేదా అనధికారికంగా ఎవరైనా మీ వాట్సాప్‌ను వాడుతున్నట్లు గమనించినా వెంటనే దాన్నుంచి లాగౌట్ అవ్వాలి.
3. రీడ్ రిసీట్స్‌ను డిసేబుల్ చేయండి
మీకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లు చూసినట్టు ఇతరులకు తెలియకూడదంటే సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్స్‌లో read receipts ఆఫ్ చేస్తే చాలు. అలా చేయడం వల్ల మీరు మెసేజ్ చూసినట్లు బ్లూ టిక్స్ ఇతరులకు కనిపించవు.
- వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
- ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి
- read receipts ఆప్షన్‌ను ఆఫ్ చెయ్యాలి
4. డిస్అపియరింగ్ మెసేజెస్ ఆప్షన్‌ను ఎంచుకోండి
వాట్సాప్ డిస్అపియరింగ్ మెసేజెస్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఇందులో చాట్‌లో పంపిన మెసేజ్‌లు వారం తర్వాత అవే ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతాయి. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
- వాట్సాప్‌లో చాట్‌ను ఓపెన్ చెయ్యాలి
- ఆ తర్వాత కాంటాక్ట్ నేమ్‌పై క్లిక్ చెయ్యండి
- ఆపై డిస్అపియరింగ్ మెసేజెస్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోండి