తెలంగాణ

telangana

ETV Bharat / state

YUVA : అర నిమిషంలోనే 5 రకాల మిల్క్​షేక్​ల తయారీ - YOUNG ENTREPRENEUR SUCCESS STORY

మిల్క్‌షేక్ బిజినెస్‌లో రాణిస్తున్న యువకుడు - సొంతంగా స్విస్‌ మిల్క్‌షేక్‌ మెషీన్‌ తయారీ - అమెరికాలో ఉద్యోగం వదిలి సొంత వ్యాపారం

Young Entrepreneur Success Story
Young Entrepreneur Success Story (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 5:05 PM IST

Young Entrepreneur Success Story : చిన్నదైనా, పెద్దదైనా అది ఏదైనా సరే సొంతంగా బిజినెస్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది. ఎలాగోలా వ్యాపారం ప్రారంభించి క్రమంగా దానిని విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అదే కోవకు చెందుతాడా యువకుడు. విదేశాల్లో ఉద్యోగం వదులుకుని వ్యాపారం వైపు అడుగేశాడు. అందరికంటే భిన్నంగా అలోచించి బిజినెస్‌కు అవసరమయ్యే మెషీన్‌ను తానే స్వయంగా తయారు చేసుకున్నాడు. మరి, ఆ యంత్రం ఎలా పని చేస్తుంది? అసలు తను చేస్తున్న వ్యాపారం ఏంటి?.

నిత్యం కొత్తగా ఆలోచిస్తూ సమస్యలు, సవాళ్లను అధిగమిస్తూ వెళ్తే జీవితమైనా, వ్యాపారమైనా సవ్యంగా సాగుతుంది. ఆ అనుభవాలే భవిష్యత్‌ ఎదుగుదలకు సోపానాలుగా మారతాయి. ఈ విషయాలనే ఒంట పట్టించుకున్నాడీ యువకుడు. వ్యాపారంలో తనదైన మార్క్ చూపించాలనే ఆలోచనతో మిల్క్‌ షేక్‌ను క్షణాల్లో తయారు చేసే పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చాడు.

విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని మరీ :ఇతడి పేరు పృథ్వీ తాతిని. ఏపీలోని ఏలూరు స్వస్థలం. ఉన్నత చదువుల కోసం 2015లో అమెరికా వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఏడాదిన్నరపాటు ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు. విదేశాల్లో ఉద్యోగం, ఉన్నతమైన జీతం అయినప్పటికీ ఏదో తెలియని వెలితి ఇతడిని వెంటాడేది. సొంతంగా వ్యాపారం చేయాలని తరచూ అనుకుంటుండేవాడు. అదే ఆలోచనతో భారత్‌కి తిరిగి వచ్చి రమేశ్ అనే వ్యక్తితో కలిసి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

మొదటి బిజినెస్‌లో అనుకున్నంత లాభాలు రాలేదీ యువకుడికి. దీంతో వినూత్నంగా ఉంటేనే వ్యాపారంలో రాణిస్తామని గ్రహించాడు. అందుకోసం తనే స్వయంగా స్విస్ మిల్క్‌షేక్ పేరుతో ఓ మిషన్‌ని తయారు చేశాడు. దీనిని రూపొందించేందుకు దాదాపు రెండేళ్లు పట్టిందని చెబుతున్నాడు. భారత్‌లోనే తక్కువ సమయంలో మిల్క్‌షేక్‌ చేసే మిషన్ ఇదని అంటున్నాడు పృథ్వీ. 5 రకాల మిల్క్‌షేక్‌లు సెకండ్ల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చని వివరిస్తున్నాడు. దానికి సంబంధించి ఐఓటీ టెక్నాలజీనీ అందుబాటులోకి తీసుకొచ్చామని చెబుతున్నాడీ ఇన్నోవేటర్‌.

అతి తక్కువ ఖర్చుతోనే మిల్క్​షేక్ మిషన్​కు రూపకల్పన :తక్కువ ఖర్చులోనే స్విస్ మిల్క్‌షేక్ మిషన్‌ను తయారు చేశానంటున్నాడీ యువకుడు. ఎవరైనా సులభంగా ఆపరేట్‌ చేయొచ్చని వివరిస్తున్నాడు. 100కు పైగా ఫ్రాంచైజీలు ప్రారంభించి, మిల్క్‌షేక్‌లతో పాటు ఫ్రూట్‌ జ్యూస్‌లూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాడు. స్విస్ మిల్క్ షేక్ మెషిన్‌కు సంబంధించి పేటెంట్ రైట్స్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాడు. ఆలోచన చిన్నదైనా ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తున్నాడీ యువకుడు. తక్కువ ప్లేస్​లోనే స్విస్ మిల్క్ షేక్ మెషీన్‌ ద్వారా బిజినెస్‌ చేయొచ్చంటున్నాడు. వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నట్లు చెబుతున్నాడు.

తిండి లేని స్థితి నుంచి పది మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి - జూట్‌ సంచుల వ్యాపారంలో రాణిస్తున్న ఒంటరి మహిళ - Inspiring women Story from Gajwel

నాటుకోడికి కేరాఫ్ అడ్రస్ : దేశీ కోడీ, కడక్‌నాథ్‌, పందెం కోడి - ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది

ABOUT THE AUTHOR

...view details