తెలంగాణ

telangana

ETV Bharat / state

10వ తరగతి పరీక్షలు రాయడం ఇక సులువే - ఈ ట్రిక్స్‌ పాటిస్తే అంతా సెట్ - TIPS AND TRICKS FOR 10TH EXAMS

రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలు - చదవడంతో పాటు రాతపై పట్టు సాధిస్తేనే పదికి పది - ఇలా ప్రిపేర్ అవుతే మంచి జీపీఏ సాధించవచ్చు అంటున్న ఉపాధ్యాయులు

10th Class Subject Wise Tips For Board Exams
10th Class Subject Wise Tips For Board Exams (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 5:41 PM IST

10th Class Subject Wise Tips For Board Exams : మరో రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటివరకూ చదివింది ఒకెత్తు అయితే పరీక్షలకు సన్నద్ధం కావడం మరో ఎత్తు. పరీక్షలను భయపడకుండా పక్కా ప్లాన్‌తో చదివితే పాస్ అవడమే కాదు పదికి పది జీపీఏ సాధించవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ నెల, ఫిబ్రవరిలో జరిగే సన్నద్ధ పరీక్షల్లో విజయం సాధిస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. పాఠ్యపుస్తకాలను చదవడం, సొంతంగా రాయడంపై పట్టు పెంచుకోవాలని సూచించారు.

వాటిలోంచి తప్పకుండా ప్రశ్న :భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన పాఠాలన్నింటినీ చదివితే నలభై మార్కులకు 30 మార్కులు సులభంగా వస్తాయి. ప్రయోగశాల కృత్యాలు ఎనిమిది ఉంటాయి. ఇందులో గరిష్ఠంగా 9 మార్కులు వస్తాయి. రేఖాచిత్రాలకు సంబంధించిన ప్రశ్నల్లో కచ్చితంగా కటకాలు, దర్పణలు ఉంటాయి. అణువుల ఆకృతుల గురించి తప్పకుండా ప్రశ్న ఉంటుంది. మూడో చాప్టర్‌లో ఆమ్లాలు, క్షారాలు పాఠం నుంచి ఒక ప్రశ్న కచ్చితంగా వస్తుంది.

అలాంటివి అభ్యాసం చేస్తే మేలు :మెలకువలు తెలుసుకుంటే ఇంగ్లీష్ పరీక్ష రాయడం చాలా ఈజీ. రీడింగ్, క్రియేటివ్ రైటింగ్, పదజాలానికి 37 మార్కులు ఉంటాయి. సృజనాత్మకతకు 20 మార్కులు ఉంటాయి. పాఠ్యపుస్తకంలోని 24 పాఠాలు చదువుకుంటే వాటిల్లోనే పదజాలం, లెటర్‌ రైటింగ్, చిత్రాల రూపకల్పన, ఆత్మకథ, ఆహ్వానం, డైరీ, పదాల్లో తప్పుల సవరణ వంటివి ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. పాఠం చదువుకుంటున్నప్పుడే అందులోని ప్రధాన అంశాలను ఒక పక్కన రాసిపెట్టుకోవడం, స్పెల్లింగ్‌లో తప్పులు గుర్తించడం వంటివి అభ్యాసం చేస్తే సరిపోతుంది.

చాప్టర్‌ వైస్ :గణితశాస్త్రం పరీక్షకు సరిగ్గా సన్నద్ధమైతే 80 మార్కులకు 80 వస్తాయి. పెద్ద ప్రశ్నలకు 24 మార్కులుంటాయి. నిర్మాణాలు, గ్రాఫ్‌లకు 12 మార్కులు ఉండగా, చాప్టర్ 1 నుంచే ఆరు మార్కులు వస్తాయి. కమ్యూనికేషన్ ఫార్ములా మీన్, మీడియన్, మోడ్‌ పాఠాల నుంచి మరో నాలుగు మార్కులు వస్తాయి. వెన్‌ డయాగ్రం గీస్తే చాలు 6 మార్కులు వచ్చేస్తాయి. ఇక రేఖాగణితం 12 మార్కులు, మెన్సురేషన్‌లో ఆరు మార్కులు, 12వ చాప్టర్‌ త్రికోణమితి అనువర్తనాలకు నాలుగు లేదా రెండు మార్కులు వస్తాయి. ప్రాబబులిటీ చాప్టర్‌లో ఫార్ములాలు తెలుసుకుని శ్రద్ధగా రాయాలి. రోజుకో పాఠం :తెలుగు పాఠ్యపుస్తకంలో 12 పాఠాలున్నాయి రోజుకో పాఠాన్ని విషయ పరిజ్ఞానంతో చదవాలి. ఏఏ పాఠం సులువుగా అర్థమవుతుంది ఏవీ కష్టంగా మారుతుందని గుర్తించాలి. స్టార్‌మార్కు పద్యాలు 10 చదువుకుంటే చాలు. ఐదు మార్కులు వస్తాయి. వ్యాకరణం, సృజనాత్మకత, , పదజాలం, స్వీయరచన అంశాలకు 40 మార్కులు వస్తాయి. సృజనాత్మకతకు సంబంధించి వివిధ రూపాల్లో కరపత్రం, ఆహ్వానపత్రం, లేఖలు సొంతంగా రాయాలి. లేఖలో స్కూల్‌ హెడ్‌మాస్టర్, డీఈవో, ఎమ్మార్వో ఇలా వేర్వేరు వ్యక్తులకు రాయగలగేలా ప్రాక్టీస్ చేయాలి.

పదజాలం వ్యాకరణం సులువుగా మార్కులు : హిందీలో పద్యాలు, సాహిత్యం, సృజనాత్మకతతో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. నాన్‌-డిటైల్‌లోని నాలుగు పాఠాల్లో ఒక వ్యాసం కచ్చితంగా వస్తుంది అందుకు తగ్గట్టు చదువుకోవాలి. పాఠం పేరు, రచయిత పేర్లనూ అడుగుతారు వాటికి కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సృజనాత్మకతలో నినాదాలు, చిత్రపటం రూపకల్పన నేర్చుకుంటే 8మార్కులు ఎటుపోవు. పదజాలం వ్యాకరణం ద్వారా 20మార్కులు సులువుగా వస్తాయి. పద్యాలు ఐదు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ఒక వ్యాసం వస్తుంది. ఇందులో మూడు పద్యాల నుంచి ప్రశ్నలు కూడా వస్తాయి.

సొంతంగా రాయొచ్చు :సాంఘికశాస్త్రంలో 28మార్కులు కేవలం గ్రాఫ్‌ విశ్లేషణ, మ్యాప్‌ డ్రాయింగ్, పాయింటింగ్‌ ద్వారా వచ్చేస్తాయి. తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ కచ్చితంగా ఉంటుంది. దీంతోపాటు సెక్షన్‌-3లో పన్నెండు మార్కుల ప్రశ్నలకు పదకొండు మార్కులు సాధించవచ్చు. సెక్షన్‌-3లో పదకొండు మార్కులకు ప్రశ్నలు, వ్యాసం ఇస్తారు. సొంతంగా రాసుకోవచ్చు. పాఠ్యపుస్తకంలోనే ఉంటుంది.

రేఖ చిత్రాలు ప్రధానం : జీవశాస్త్రం పరీక్ష కఠినమైంది కాదు 9 పశ్నలుంటాయి. మైటో కాండ్రియా, హృదయం, మూత్రపిండం, స్త్రీ పునరుత్పత్తి వంటివి రేఖాచిత్రాల్లో ప్రధానమైనవి. దీంతోపాటు విటమిన్, ఎంజైమ్‌ల టేబుల్స్‌ వస్తాయి. వీటితో పాటు మరికొన్ని టేబుల్స్‌ చూసుకోవాలి.

టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ టిప్స్ - సబ్జెక్టుల వారీగా ఈ కిటుకులు గుర్తుంచుకోండి!

పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో భారీ మార్పులు

పదో తరగతి విద్యార్థులు ఇలా ప్రిపేరైతే - 10కి 10 గ్యారంటీ!

ABOUT THE AUTHOR

...view details