Sago Roti Recipe in Telugu : చాలా మంది ఇంట్లో సగ్గుబియ్యం ఉన్నాయంటే కిచిడీ, ఉప్మా లేదా వడలు చేస్తుంటారు. అదే పండగల టైమ్లో అయితే పాయసం ప్రిపేర్ చేసుకుంటుంటారు. అలాగే, కొన్ని రకాల పిండివంటల్లోనూ వీటిని ఎక్కువగా వాడుతుంటారు. కానీ, ఎప్పుడైనా "సగ్గుబియ్యంతో రొట్టెలను" ట్రై చేశారా? లేదంటే ఓసారి తప్పక ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటాయి. ఇంట్లో అందరికీ నచ్చేస్తాయి ఈ రొట్టెలు. మరి, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బంగాళదుంప - 1
- సగ్గుబియ్యం - 1 కప్పు
- జీలకర్ర - 1 చెంచా
- మిరియాల పొడి - 1 చెంచా
- కొత్తిమీర తరుగు - పావు కప్పు
- ఛాట్ పౌడర్ - చెంచా
- అల్లం మిర్చి తరుగు - చెంచా
- ఉప్పు - రుచికి తగినంత
- ఆమ్చూర్ పౌడర్ - పావు చెంచా
- నెయ్యి - 1 చెంచా
- నూనె - 4 చెంచాలు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఆలోపు బంగాళదుంపను ఉడికించి పొట్టు తీసి మెత్తగా మాష్ చేసుకొని పక్కనుంచాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని సిద్ధం చేసుకోవాలి. అంటే కొత్తిమీర, అల్లం మిర్చి తరుగుని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 గంటలు నానబెట్టిన సాబూదానాను వాటర్ వడకట్టుకొని వేసుకోవాలి.
- ఆపై అందులో మాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముద్ద, నెయ్యి, జీలకర్ర, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, ఛాట్ పౌడర్, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం మిర్చి తరుగు, ఉప్పు వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే వరకు మళ్లీ మళ్లీ కలుపుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని 8 భాగాలుగా ఉండలు చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటపై పాలిథిన్ కవర్ ఉంచి దానిపై కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆపై ఒక్కో ఉండను చేత్తో తడుతూ చిన్న రొట్టెలా చేసుకోవాలి.
- ఆవిధంగా అన్నీ చేసుకున్నాక స్టౌపై పెనం పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "సగ్గుబియ్యం రొట్టెలు" రెడీ!
- ఇక ఈ రొట్టెలను పుదీనా లేదా కొబ్బరి పచ్చడితో తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. లేదంటే టమాటా సాస్, కెచప్తోనూ తినొచ్చు.
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా సాబుదానా రొట్టెలను ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే వీటిని ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు!
ఇవీ చదవండి :
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "నువ్వుల బర్ఫీ" - టేస్ట్ అదుర్స్ - పైగా ఆరోగ్యం బోనస్!
సూపర్ టేస్టీ "సగ్గుబియ్యం దోశలు" - నిమిషాల్లో చేసుకోండిలా! - అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది!