తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన రేరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ

HMDA Ex Director Shiva Balakrishna Case Update : అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన రేరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ మరోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తన కస్టడీ ముగిసిందున బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన కోరారు. గతంలో ఒకసారి బెయిల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తాజాగా దాఖలైన పిటిషన్‌పై ఏసీబీ కౌంటర్‌ దాఖలు చేయనుంది.

HMDA Ex Director Shiva Balakrishna Case Update
HMDA Ex Director Shiva Balakrishna Case Update

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 3:25 PM IST

Updated : Mar 6, 2024, 4:30 PM IST

HMDA Ex Director Shiva Balakrishna Case Update : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ మరోసారి కోర్టును ఆశ్రయించారు. తన కస్టడీ ముగిసినందున బెయిల్ ఇవ్వాలని ఆయన ఏసీబీ కోర్టులో(ACB Court) పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం శివ బాలకృష్ణ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. గతంలో ఆయన బెయిల్​ పిటిషన్​ను న్యాయస్థానం కొట్టేసింది.

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

తాజా పిటిషన్​పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు అవినీతి నిరోధక శాఖను(ACB enquiry) ఆదేశించింది. ఏసీబీ మరోసారి అతనికి బెయిల్‌ మంజూరు చేయవద్దని కోర్టును కోరే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుండడం, బాలకృష్ణకు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని ఏసీబీ న్యాయస్థానానికి తెలపనుంది.

ACB Investigation On Balakrishna Case : శివబాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో విస్తురపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 27న ఆయన ఇళ్లు, కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేసింది. ఈ సోదాల్లో రూ.250 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను పోగుచేసినట్లు ఏసీబీ అధికారులు కనుక్కున్నారు.

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు

ఇందులో బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది. సత్యనారాయణ, భరత్‌ ఇద్దరు బాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నందున వారిని విచారించారు.

Shiva Bala Krishna Case Update :భరత్‌కుమార్‌ పేరిట నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరులో 13 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించింది. వాటి కొనుగోలుకు ఆదాయ వనరుల గురించి ప్రశ్నించగా భరత్‌కుమార్‌ నుంచి సరైన సమాధానం లభించలేదు. ఈ భూమి కూడా శివబాలకృష్ణ అక్రమార్జనతోనే ఆ భూముల్ని కొనుగోలు చేసి భరత్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది.

బాచుపల్లి ప్రాంతంలో ఉండే మరో బినామీ సత్యనారాయణ మూర్తి శివబాలకృష్ణ అక్రమార్జనను ఆస్తులుగా మలచడంలో కీలకపాత్ర పోషించాడనే అనుమానంతో విచారించింది. ఇందుకు తగిన సాక్ష్యాాధారాలను కూడా సేకరించింది. ఇప్పుడు శివబాలకృష్ణ బెయిల్​పై బయటకు వస్తే సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది.

శివబాలకృష్ణ కేసు లేటెస్ట్ అప్డేట్​ - ఆ ఐఏఎస్ అధికారిని విచారించే యోచనలో ఏసీబీ

శివబాలకృష్ణ బినామీలను విచారిస్తున్న ఏసీబీ - ఆ ఇద్దరి పేరు మీద అనేక భూములు, స్థలాలు!

Last Updated : Mar 6, 2024, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details