ETV Bharat / state

మేము చెప్పినట్టు చేయండి అధిక లాభాలు వస్తాయన్నారు - రూ.2.43 కోట్లు కొట్టేశారు - TWO PEOPLE LOST 2CR IN CYBER CRIME

పెట్టుబడులకు లాభాలంటూ ఇద్దరికి సైబర్‌ నేరగాళ్ల కుచ్చుటోపీ - రూ.1.22 కోట్లు పోగొట్టుకున్న శాస్త్రవేత్త - 1.2 కోట్లు మోసపోయిన ప్రైవేటు ఉద్యోగి

Two People Lost RS.2.43 crore In Cyber Fraud in Hyderabad
Two People Lost RS.2.43 crore In Cyber Fraud in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 4:55 PM IST

Two People Lost RS.2.43 crore In Cyber Fraud in Hyderabad : పెట్టుబడులకు భారీగా లాభాలు వస్తాయంటూ, స్టాక్ ట్రేడింగ్ పేరిట నమ్మించి సైబర్ నేరగాళ్లు వేర్వేలు ఘటనల్లో ఇద్దరి నుంచి రూ.2.4 కోట్లు దోచుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి పర్సనల్ లోన్ తీసుకుని మరి పంపించడం గమనార్హం.

వారు చెప్పిన యాప్​ డౌన్​లోడ్​ చేసుకుని మరి : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఫోన్​ నెంబరును గుర్తుతెలియని వ్యక్తులు డిసెంబరు చివరి వారంలో ఓ వాట్సాప్​ గ్రూప్​లో యాడ్ చేశారు. స్టాక్​ ట్రేడింగ్ చేస్తే బాగా డబ్బు వస్తుందని నమ్మించారు. తాము ట్రేడింగ్​కు సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తామని గ్రూప్​లో సందేశాలు పంపించేవారు. ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త వారు చెప్పినట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో ఉన్న యాప్​ను డౌన్​లోడ్ చేయించారు. మొదటగా షేర్లు కొనుగోలు చేసి నాలుగైదు రోజుల్లో మంచి ధర వస్తే విక్రయించాలని సూచించారు. ఇలా షేర్లు కొనుగోలు చేయించి ఆ డబ్బును వేర్వేలు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.

లాభం విత్​డ్రా చేసుకుందాం అనేలోగా : మొదట్లో షేర్లు కొన్నందుకు శాస్త్రవేత్తకు రూ.50వేల లాభం వచ్చింది. ఇదంతా నిజమేనని నమ్మిన శాస్త్రవేత్త భారీగా లాభాలు వస్తాయని ఆశపడి డిసెంబరు 24 నుంచి 18 రోజుల్లో 16 లావాదేవీల్లో రూ.1.22 కోట్లు నేరగాళ్లకు పంపించాడు. షేర్ల కొనుగోలుకు డబ్బులు సర్దుబాటు కాకపోతే వ్యక్తిగత రుణం తీసుకుని మరీ నేరగాళ్లకు పంపాడు. అయితే పెట్టుబడితో కలిపి లాభం రూ.3.26 కోట్లు నకిలీ యాప్​లో చూపించింది. కానీ విత్​డ్రా చేసుకునేందుకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఆయన వాట్సాప్​ ద్వారా వారిని సంప్రదించగా ఇప్పుడే విత్​డ్రా వద్దని, లాభం మరింత రావాలంటే ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ నేరగాళ్ల మెలికపెట్టారు. కానీ శాస్త్రవేత్త మాత్రం విత్​డ్రాకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకురాగా అదనంగా రూ.కోటి పంపించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో శాస్త్రవేత్త సైబర్​క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విరాళాలు ఇస్తామంటూ వచ్చే లింకులను నమ్మకండి - ఎందుకో చెప్పిన సైబర్ క్రైమ్ పోలీసులు

ఇంట్లో ఉంటూ పని చేస్తూ సంపాదించొచ్చు : సోషల్​ మీడియాలో ఇటీవల కాలంలో ఇంటి దగ్గరే ఉంటూ డబ్బు సంపాదించొచ్చు అనే యాడ్​లు కనిపిస్తుంటాయి. అలా ఆశ చూపించిన సైబర్ నేరగాళ్లు ఓ ప్రేవేటు ఉద్యోగి నుంచి రూ.1.20 కోట్లు కొల్లగొట్టారు. హైదరాబాద్​ కేపీహెచ్​బీలో నివాసముండే ప్రైవేటు ఉద్యోగి వాట్సాప్​కు ఓ సందేశం వచ్చింది. తాము ఇచ్చే టాస్కులు పూర్తి చేస్తే రోజువారిగా డబ్బులు ఖాతాలో పడతాయని అందులో ఉంది. దీంతో నమ్మిన వ్యక్తి మొదటగా కొన్ని టాస్కులు పూర్తి చేశారు. దాన్నే అవకాశంగా తీసున్న సైబర్ నేరగాళ్లు తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించగా నిజమేననుకున్న ప్రైవేటు ఉద్యోగి తొలిసారి రూ.10,500 పెట్టుబడి పెట్టారు.

విత్​డ్రా చేసుకోవాలంటే అదనంగా చెల్లించాలంటూ డిమాండ్: నేరగాళ్లు ఈ మొత్తానికి లాభంతో కలిపి రూ.15,200 తిరిగి అతనికి పంపించారు. రెండోసారి కూడా అతను రూ.10,500 పెట్టుబడిగా పెట్టగా, అంతకు రెట్టింపు పెట్టాలని నేరగాళ్లు అతనికి సూచించారు. బాధితుడు రూ.50వేలు పెట్టుబడిగా పెట్టగా అందుకు రూ.65,100 వచ్చినట్లు ఓ వెబ్​సైట్లో వర్చువల్​గా చూపించారు. లాభం రావడంతో నమ్మకం పెంచుకున్న ఉద్యోగి రూ.2 లక్షలు పంపించాడు. అలా డిసెంబరు 6 నుంచి జనవరి 7 వరకూ దఫదఫాలుగా రూ.1.20 కోట్లు పంపించాడు. దీనికి రూ. 14.83 లక్షల లాభం వచ్చినట్లు వర్చువల్ చూపిస్తుంది కానీ విత్​డ్రా చేసుకోవడానికి మాత్రం రావడం లేదు. దీంతో నేరగాళ్లను సంప్రదించగా, విత్​డ్రా చేసుకునేందుకు అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.

అమెరికాలోని కుమార్తెకు ఫుడ్ పార్సిల్ పంపిన మహిళ- బ్యాంక్​ అకౌంట్లో రూ.కోటిన్నర మాయం!

సైబర్‌ నేరాలపై సాంకేతిక అస్త్రం - 25 వేల సిమ్‌లు, ఐఎంఈఐ నంబర్లు బ్లాక్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.