Sankranti Pig Fight Competition In Godavari Districts : సంక్రాంతి అంటే కోడి పందేలు, ఎడ్ల పోటీలు, పొట్టేళ్ల పోటీలు నిర్వహిస్తుంటారు. అది అందరికి తెలిసిన విషయం. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా పందుల పోటీ నిర్వహించారు అంటే నమ్ముతారా? ప్రత్యేకంగా ఈ పండుగ రోజే ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిని చూసేందుకు ప్రజల సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మరి ఇంతకి ఈ పోటీలు ఎక్కడ నిర్వహిస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు కావాలి : ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో సంక్రాతి పండుగ పురస్కరించుకుని ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పందులు పోటీలను నిర్వహించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందినవారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. కత్తులు కట్టని, ప్రాణహాని లేని ఈ పోటీలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కావాలని నిర్వాహకులు సింగం సుబ్బారావు కోరారు.
పందెం కోడి పండక్కి రెడీ - తగ్గేదేలే అంటున్న పందెం రాయుళ్లు
మొదటి స్థానంలో : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పందుల మధ్య పోటీలు రసవత్తరంగా సాగాయి. నెల్లూరు జిల్లా బుచ్చి గ్రామం, కోనసీమ జిల్లా వలస గ్రామం మధ్య పోటీలు పెట్టగా బుచ్చి గ్రామానికి చెందిన వారాహి విజేతగా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా తిరుపతిపాడు, కొమ్ముగూడెం గ్రామాల పందుల మధ్య పోటీ పెట్టగా తిరుపతిపాడుకు చెందిన వారాహి గెలిచి రెండో స్థానంలో నిలిచింది.
తూర్పుగోదావరి జిల్లా మండపేట, నిడదవోలు గ్రామాలకు చెందిన పందుల మధ్య పోటీ జోరుగా సాగింది. మండపేట గ్రామానికి చెందిన వారాహి విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామాల మధ్య పోటీ జరగ్గా తాడేపల్లిగూడెం గెలిచింది.
తగ్గేదే లే అంటున్న పందెం కోళ్లు - ఒక్కోదాని ధర తెలిస్తే షాక్!
వారికి హైకోర్టు నిబంధనలు పట్టవ్ అంతే - జోరుగా కోడి పందేలు, గుండాట