Father Killed Four Year Son At Proddatur : తల్లిని కోల్పోయిన కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడు అయ్యాడు. నాలుగేళ్ల కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచాల్సింది పోయి కర్కశత్వాన్ని చూపాడు. ముద్దులొలికే పసి పిల్లాడిని నిత్యం హింసకు గురిచేశాడు. కాళ్లూ, చేతులు విరిగిగేలా దాడి చేసి నరకం చూపించాడు. చివరకు అభం శుభం తెలియని ఆ బాలున్ని కొట్టి చంపేశాడు. నిండునూరేళ్లు బతకాల్సిన బుడతడిని పసిప్రాయంలోనే ప్రాణాలు తీసిన ఆ తండ్రి ఆపై ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. ఒంటిపై గాయాలు ఉండటాన్ని గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ తండ్రి రాక్షసత్వం బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది.
కూతురు పాలిట యమపాశమైన తండ్రి :ప్రొద్దుటూరుకు చెందిన షేక్ ఇమ్రాన్‌కు, వీరపునాయుని పల్లె మండలం ఉరుటూరుకు చెందిన షాబిరున్లకు 2016లో వివాహం అయ్యింది. వీరికి ఆరేళ్ల కుమార్తె రుబీనా, నాలుగేళ్ల కుమారుడు ముస్తఖీం సంతానం. ముస్తఖీం జన్మించిన నాలుగు రోజులకే తల్లి షాబిరున్ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో పిల్లలు ఇద్దరూ తండ్రి వద్దే ఉంటున్నారు. ఇమ్రాన్ ఎలక్ట్రీషియన్ పనులు సాగిస్తున్నాడు. చాలా రోజుల నుంచి కుమారుడు ముస్తఖీంను ఇమ్రాన్ కొట్టి హింసించేవాడు. గతేడాది మే నెలలో మరో మహిళను ఇమ్రాన్ రెండో వివాహం చేసుకున్నాడు.
లేడీ CEO కేసులో షాకింగ్ నిజాలు- పక్కా ప్లాన్‌తోనే కుమారుడి హత్య! కారణం ఏంటంటే?