తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏక సభ్య కమిషన్ నివేదిక సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్

ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో ఏకసభ్య కమిషన్​ నివేదిక సమర్పించాలి - ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి

cm revanth sc Classification
cm revanth sc Classification (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 2:50 PM IST

Updated : Oct 9, 2024, 3:29 PM IST

CM Revanth Reddy on SC Classification : ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్​ నివేదిక ఇచ్చిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య న్యాయ కమిషన్​ ఏర్పాటు ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ఏక సభ్య కమిషన్​ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ముందుకెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని కమిషన్​ అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Last Updated : Oct 9, 2024, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details