BRS Hyderabad Lok Sabha Meeting 2024 :లోక్ సభ సన్నాహకాల్లో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల శాసనసభ ఎన్నికల ఫలితాలపై సమీక్షలతో పాటు లోక్‌సభఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.
రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టి బీఆర్ఎస్పై విశ్వాసం ప్రకటించారన్న నేతలు సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో పూర్తి మెజార్టీ ఉందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి సమావేశంలో స్థానం లేదని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తెలంగాణ భవన్ వెలుపల ఇరువర్గాల అనుచరుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట కూడా జరిగింది.
KTR Review Meeting With Hyderabad BRS Leader :మరో ఎమ్మెల్యేపై సమావేశంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వ్యతిరేకవర్గం అందుకు అడ్డు చెప్పింది. ప్రత్యేకించి పాతబస్తీకి చెందిన పలువురు మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. మజ్లిస్‌తో స్నేహం అంటూ సొంత పార్టీ వారిని కనీసం పట్టించుకోపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు కొందరు నాయకులు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఉద్యమకారులను పట్టించుకోలేదని అసంతృప్తిని వెల్లగక్కారు. ఒక ఉద్యమకారుడిని కేటీఆర్ వెంట తీసుకెళ్లి బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నెల నుంచి ఎవరు కరెంట్ బిల్లు కట్టవద్దు : కేటీఆర్
BRS Focus on Lok Sabha Elections 2024: బీజేపీతో మైత్రి దుష్ప్రచారమని కేటీఆర్ కొట్టిపారేశారు. బీజేపీతో బీఆర్ఎస్ఎన్నటికీ కలవబోదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రభుత్వం ఇన్ని ఫ్లైఓవర్లు పూర్తి చేస్తే కేంద్రం నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లై ఓవర్ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేవలం రైల్వే స్టేషన్లలో లిఫ్ట్‌ల ప్రారంభానికి మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. త్వరలోనే మైనార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై అన్ని అంశాలపై చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు.