Minister Nara Lokesh responds on Red Book :తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్‌బుక్‌లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇంకా రెడ్‌బుక్ తెరవక ముందే జగన్ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్‌రెడ్డిని జాతీయ మీడియా కోరితే, విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి రెడ్‌బుక్‌కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి మరీ ప్రచారం కల్పించారని ఆయన పేర్కొన్నారు.
గౌరవంగా చూసుకుంటాం.. గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 మీడియా సమావేశాలు పెడితే, ఈఎన్నికల్లో 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్మీట్లు పెట్టారని లోకేశ్ పేర్కొన్నారు. జగన్ చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే, వాస్తవాలను తాము వివరిస్తామని స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుంటామని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నేతల వలే, కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరని, జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరని ఆయన తెలిపారు.
ఇవాళ అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేశ్‌కు వినతులు వెల్లువెత్తాయి. పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు ఆయనని కలిసి తమ తమ బయోడేటాలు అందచేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.