ETV Bharat / state

హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యం - 45 గంటలపాటు గాలించిన డీఆర్ఎఫ్‌ - HUSSAIN SAGAR ACCIDENT TWO DIED

హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యం - ఈ నెల 26న భారతమాతకు హారతి కార్యక్రమం సందర్భంగా అగ్నిప్రమాదం - అజయ్ ఆచూకీ కోసం 45 గంటలు శ్రమంచిన డీఆర్ఎఫ్​

Ajay Missing in Hussain Sagar Fire Incident
Ajay Missing in Hussain Sagar Fire Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 6:45 PM IST

Updated : Jan 28, 2025, 6:54 PM IST

Ajay Missing in Hussain Sagar Fire Incident : హుస్సేన్‌ సాగర్‌ బోటు ప్రమాదంలో మరణాల సంఖ్య రెండుకు చేరింది. హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యం అయ్యింది. ఈ నెల 26న భారతమాతకు హారతి కార్యక్రమం సందర్భంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పడవలకు మంటలు అంటుకోవటం చూసి అజయ్‌ హుస్సేన్‌సాగర్‌లోకి దూకాడు. హుస్సేన్‌సాగర్‌లో అజయ్ కోసం డీఆర్ఎఫ్‌ సిబ్బంది 45 గంటలపాటు గాలించి మృతదేహన్ని వెలికితీసింది.

అజయ్‌ బంధువుల ఆందోళన : అజయ్​ మృతదేహం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అజయ్‌ మృతదేహం చూపించాలని అజయ్‌ బంధువులు సంజీవయ్య పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి గాంధీకి తీసుకెళ్లారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి : మరోవైపు హుస్సేన్‌ సాగర్‌ బోటు ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడ్డ గణపతి ఇవాళ ఉదయం చనిపోయాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గణపతి డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హుస్సేన్‌ సాగర్‌లో జరుగుతున్న భారతమాత మహా హారతి కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన క్రమంలో బోటులో ఉండగా ఒక్కసారిగా బాణాసంచా పడి మంటలు చెలరేగడంతో గణపతి శరీరం పూర్తిగా కాలిపోయింది.

80 శాతం కాలిన గాయాలతో రెండు రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి, పరిస్థితి విషమించడంతో ఈరోజు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గణపతి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు.

హుస్సేన్‌సాగర్‌ అగ్ని ప్రమాద ఘటన - ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

అజయ్ ఎక్కడ? - 24 గంటలు గడిచినా ఇంకా దొరకని ఆచూకీ

Last Updated : Jan 28, 2025, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.